Telangana : పోలీసుల ఎదుట లొంగిపోయిన బర్సే సుక్కా
మావోయిస్టు అగ్రనేత బర్సే సుక్కా అలియాస్ దేవా పోలీసుల ఎదుట లొంగిపోయాడు
మావోయిస్టు అగ్రనేత బర్సే సుక్కా అలియాస్ దేవా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆయన లొంగిపోయారు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, ఆయనభార్యతో పాటు మరొక 48 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఆయుధాలతో పాటు ఇరవై లక్షలు...
ఆయుధాలతో పాటు ఇరవై లక్షల రూపాయల నగదును కూడా అప్పగించారు. దీంతో పాటు హెలికాప్టర్లను కూల్చే ఆయుధ సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవాపై 75 లక్షల రివార్డు ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలసి పోవాలని డీజీపీ కోరారు.