Hyderabad : ఇలా రోడ్డుపైకి వస్తే భారీ జరిమానా .. పోలీసుల వార్నింగ్

హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Update: 2026-02-12 07:14 GMT

హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు ప్రకటించారు. మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నగరంలో ప్రతి చోటా తనిఖీలుంటాయని, అది గుర్తుంచుకుని లైసెన్స్ ఉంటేనే రోడ్డు మీదకు వాహనంతో రావాలని కోరారు.

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి ఒకటో తేదీ నుంచి వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఒరిజినల్ లేదా డిజిటల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్ లేకుండా పట్టుబడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది. లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే, ప్రమాదం జరిగినప్పుడు యజమానిని బాధ్యుడిని చేస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాదని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News