Hyderabad : హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. సీఎన్జీ గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల కిలోమీటర్ల కొద్దీ ఆటోలు క్యూ కట్టి ఉన్నాయి. గంటల తరబడి బంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. సీఎన్జీ కొరత లేదని చెబుతున్నప్పటికీ బంకుల్లో మాత్రం తమకు నింపడం లేదని ఆటోవాలాలు ఆరోపిస్తున్నారు.
తెల్లవారు జాము నుంచే...
తెల్లవారుజాము నుంచే బంకుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కుతున్నారు. అక్కడే ఆందోళనకు దిగుతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గ్యాస్ లేదంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం గ్యాస్ కొరత లేదని చెబుతుంది.