తెలంగాణ గవర్నర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

తెలంగాణ గవర్నర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కలిశారు

Update: 2026-03-30 07:56 GMT

తెలంగాణ గవర్నర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీపై విచారణ జరిపించాలని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఐడీ చేత విచారణ చేయిస్తే, మంత్రిగా పొంగులేటి ఉంటే ఆ కేసులో ఎవరికి న్యాయం జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నించిన తమను రెండు సభల నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు.

వట్టినాగులపల్లి భూ కబ్జాలపై...
వట్టినాగులపల్లిలో జరిగిన భూ కబ్జాలపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. వందల కోట్ల భూముల విలువైన భూములను ప్రభుత్వంలో పెద్దలు కొల్లగొడుతున్నారని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. అన్ని వివరాలను గవర్నర్ కు అందించామని కేటీఆర్ తెలిపారు. తాము ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు


Tags:    

Similar News