Hyderabad : గ్యాస్ బుకింగ్ పేరిట ఘరానా మోసం

గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.

Update: 2026-03-30 05:02 GMT

గ్యాస్ బుకింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ బుకింగ్, KYC అప్‌డేట్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది మోసాల బారిన పడుతున్నారని తెలిపారు. మీ ఓటీపీ , బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని పోలీసులు తెలిపారు. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.

అధికారిక వెబ్ సైట్లను మాత్రమే...
గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక యాప్స్ లేదా వెబ్‌సైట్లను మాత్రమే వాడాలని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గ్యాస్ బుకింగ్స్ పేరిట సైబర్ నేరాలు ఎక్కువగా ఉండటంతో పోలీసులు ఈ అలెర్ట్ ప్రకటించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1967 లేదా 100 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.



















Tags:    

Similar News