Breaking : ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్
సినిమాలను పైరసీ చేసిన ఐబొమ్మ రవికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
సినిమాలను పైరసీ చేసిన ఐబొమ్మ రవికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి రోజూ సీసీఎస్ పోలీసుల ఎదుటకు హాజరు కావాలని ఆదేశించింది. భారత్ ను విడిచి వదలివెళ్లవద్దని, పాస్ పోర్టు సీజ్ చేయాలని తెలిపింది. దేశం విడిచి వెళ్లడానికి వీలు లేదని ఆంక్షలు విధించింది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై కూడా షరతులు విధించింది. పాస్ పోర్టు సరెండర్ చేయాలని తెలిపింది. ఇంటర్నెట్ ను వినియోగించవద్దని,
ఇంటర్నెట్ వాడాలనుకుంటే...
ఇంటర్నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని కూడా ఐబొమ్మ రవిని న్యాయస్థానం ఆదేశించింది. సినిమా పైరసీ కేసులో ఐబొమ్మరవి గత ఏడాది నవంబరు 16వ తేదీన అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు మూడు నెలల పాటు జైలులో సినిమా పైరసీ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.