Telangana : గాంధీ భవన్‌లో సంబరాలు

లంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో గాంధీ భవన్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు

Update: 2026-02-13 07:55 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో గాంధీ భవన్‌లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఫలితాలు మొదలయినప్పటి నుంచి కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తుండటంతో వె కార్యకర్తలు గాంధీ భవన్‌కు చేరుకుని జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు డ్యాన్స్ లు చేస్తూ, డప్పు కొడుతూ సంబరాలు జరిపారు.

కేకు కట్ చేసి...
పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ హర్షాతిరేకం వ్యక్తం చేశారు. “సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్”, “టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్”, “రాహుల్ గాంధీ జిందాబాద్”, “మల్లిఖార్జున ఖర్గే జిందాబాద్” అంటూ నినాదాలతో గాంధీ భవన్ మారుమోగింది.


Tags:    

Similar News