వినాయక చవితికి ముస్తాబవుతున్న తెలంగాణ జిల్లాలు

వినాయక చవితి అంటే చాలు పలు నగరాల్లో గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.

Update: 2022-08-26 06:15 GMT

వినాయక చవితి అంటే చాలు పలు నగరాల్లో గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రులను నిర్వహిస్తూ వస్తుంటారు. ఇక కొద్ది రోజులు మాత్రమే వినాయక చవితికి సమయం ఉండడంతో పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక పలు జిల్లాలలో కూడా ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లను చేస్తూ వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ అధికారులను ఆదేశించారు. అధికారులతో కలెక్టర్‌ హరీశ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ నెల 31 నుంచి జరిగే గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందని అన్నారు. మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా 17 చెరువులలో నిమజ్జనాలు జరుగనున్నట్లు, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. వినాయకుల ను నిమజ్జనం చేసే చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచే విధంగా మత్స్యశాఖ అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. 17 చెరువుల వద్ద క్రేన్లను ఉంచాలని సూచించారు. పండుగను ప్రశాంత వాతావారణంలో జరుపుకోవాలన్నారు.

మిగిలిన జిల్లాల కలెక్టర్లు కూడా అధికారులు కీలకమైన సూచనలు చేశారు. తెలంగాణలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ.. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయోనని కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది.


Tags:    

Similar News