తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది అతి పెద్ద విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే..?

ఈ ఏడాది జరగనున్న వినాయక చవితి వేడులకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి.

Update: 2022-08-27 02:15 GMT

ఈ ఏడాది జరగనున్న వినాయక చవితి వేడులకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. విశాఖపట్నంలోని గాజువాకలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నగరంలోని గాజువాకలోనున్న లంకా మైదానంలో ఏకంగా 89 అడుగుల 'కైలాస విశ్వరూప మహా గణపతి' విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నద్ధాలు జరుగుతున్నాయి. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే మూడు కన్నుల గణేశుడికి ఒక కన్ను శివుడు, మరో కన్ను పార్వతి దేవి రూపాలతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఇక ఈ విగ్రహాన్ని ఖైరతాబాద్‌కు చెందిన శిల్పకారుడు చిన్నస్వామి రాజేంద్రన్‌ ఒడిశా, తమిళనాడుకు చెందిన కళాకారుల సహకారంతో తెల్ల మట్టి, వెదురు కర్రలతో తయారు చేస్తున్నారు. గాజువాక మహాగణపతితోపాటు దొండపర్తిలో 48 అడుగుల ఎత్తు గల మరో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన కళాకారుల బృంధం తయారు చేస్తోంది. ఇక 35 కిలోల బారీ లడ్డూ గణేశుడికి సమర్పించనున్నారు. తాపేశ్వరంలోని ప్రసిద్ధ స్వీట్ షాప్‌ శ్రీ భక్త ఆంజనేయ సురుచి ఫుడ్స్ అతి పెద్ద లడ్డును తయారు చేసి మహా గణపతికి సమర్పిస్తున్నారు.

ఇక హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణనాథుడి భారీ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. విగ్రహ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. ఈ సారి ఖైరతాబాద్‌ గణేషుడిని 50 అడుగుల మట్టితో తయారు చేస్తున్నారు. గణనాథునికి కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపున త్రిశక్తి మహాగాయత్రీ దేవి దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు భారీగా జనం వెళ్లనున్నారు.


Tags:    

Similar News