వినాయక చవితి పూజా విధానం

వినాయక చవితి వచ్చేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేసేస్తూ ఉంటారు.

Update: 2022-08-27 01:45 GMT

వినాయక చవితి వచ్చేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేసేస్తూ ఉంటారు. అయితే వినాయక చవితి పూజా విధానం చాలా మందికి తెలియదు. మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. పూజకి ముందే పసుపు, కుంకుమ, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, బెల్లం, పంచామ్రుతం, తోరం, దీపారాధాన కుందులు, నెయ్యి, వత్తులు, 21 రకాల ఆకులు (పత్రి), నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. దీపారాధన కోసం తీసుకున్న జిల్లేడు వత్తులను వాడి నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత కలశం, పసుపు వినాయకుడిని సిద్ధం చేసుకొని ఆ తర్వాత వినాయక ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆపై సంకల్పం తీసుకొని కలశ పూజ చేయాలి. ఆ తర్వాత పసుపుతో చేసిన గణపతికి మహా గణాధిపతి పూజ చేయాలి. ఆపై విగ్రహ స్థాపన చేసి పంచామ్రుతాలతో అభిషేకం చేసి అథాంగ పూజ ప్రారంభించాలి. తర్వాత మనం తీసుకున్న 21 పత్రాలతో ఏక వింశతి పూజ, అష్టోత్తర నామావళి చెప్పి వినాయక వ్రత కథ చదవాలి. ఆఖరులో వినాయక దండకం చదివి.. నైవేద్యం అర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఆఖరులో పూజకు ఉపయోగించిన అక్షతలను తలపై వేసుకోవాలి. మొదటి రోజు అంటే వినాయక చవితి రోజు పూర్తి పూజ చేసి ఆ తర్వాత రోజూ వినాయక దండకం చదివి అర్చన చేసి హారతి ఇచ్చి నైవేద్యం అర్పించాలి.


Tags:    

Similar News