ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలు

వక్ఫ్ బోర్డు ఈ ఆస్తి తమదేనని పేర్కొంటూ యాజమాన్యం విషయంలో ప్రభుత్వాన్ని సవాలు చేసింది.

Update: 2022-08-27 02:57 GMT

వినాయక చవితి వేడుకలకు కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా సమాయత్తమవుతూ ఉంది. బెంగళూరు నగరంలోని ఈద్గా మైదానంలో గణేశుడి విగ్రహాం ఏర్పాటు చేసుకోవడానికి కర్ణాటక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈద్గా మైదానంలో, చామరాజపేట క్రీడా మైదానంలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు సూచించింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంతో బెంగళూరులోని చామరాజ్‌పేటలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. "భారత సమాజం మత, భాషా, ప్రాంతీయ లేదా విభాగ వైవిధ్యాలను కలిగి ఉంది. రాజ్యాంగం సమాజంలోని వివిధ వర్గాల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది. మత సహనం భారతీయ నాగరికత లక్షణం. కేసుకు మధ్యంతర ఉత్తర్వును సవరించి, ఆగస్టు 31 నుండి పరిమిత కాలానికి మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి సందేహాస్పద భూమిని ఉపయోగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతించాలీ"అని ఉత్తర్వుల్లో ఉంది.

వినాయకుడి విగ్రహం నిర్ణయిత గడువు లోపు ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. బెంగళూరు నగరంలోని చామరాజపేట క్రీడామైదానం రెవన్యూ శాఖకు చెందినదని బీబీఎంపీ అధికారులు కోర్టుకు చెప్పారు. ఇటీవల చామరాజపేట క్రీడా మైదానాన్ని బీబీఎంపీ రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చామరాజపేట క్రీడామైదానం రెవెన్యూ శాఖ అధికారులకు చెందడంతో ఆ స్థలాన్ని ధార్మిక కార్యకలాపాలకు ఇచ్చే హక్కు రెవెన్యూ శాఖ అధికారులకు ఉందని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈద్గా మైదానం ప్రభుత్వ ఆస్తి కాబట్టి గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు కర్ణాటక వక్ఫ్ బోర్డు ఈ ఆస్తి తమదేనని పేర్కొంటూ యాజమాన్యం విషయంలో ప్రభుత్వాన్ని సవాలు చేసింది.


Tags:    

Similar News