ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు..?

పురాణాల ప్రకారం, భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వినాయకుడు జన్మించాడు. గణేష్ చతుర్థి పండుగ ఈసారి

Update: 2022-08-26 05:10 GMT

భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. రక్షాబంధన్, జన్మాష్టమిని దేశంలో ఎంతో ఘనంగా చేసుకున్నారు. ఇప్పుడు గణేష్ చతుర్థి ఉత్సవాల సందడి మొదలు కాబోతోంది. పురాణాల ప్రకారం, భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వినాయకుడు జన్మించాడు. గణేష్ చతుర్థి పండుగ ఈసారి ఆగస్టు 31, 2022న జరుపుకుంటారు. గణేష్ చతుర్థి 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించే పండుగ. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు గణేషుడి నిమజ్జనాన్ని నిర్వహిస్తారు. ఇక గణేష్ నిమజ్జనం దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31న నిర్వహించనున్నారు. చివరిరోజున భారీ ఊరేగింపులతో వినాయక నిమజ్జనం ఉంటుంది. గణేశుని నిమజ్జనం ఈసారి సెప్టెంబర్ 9వ తేదీన ఉంది. సంపద, జ్ఞానం, విజయం, విజ్ఞానం, ఆరోగ్యం, ధన సంపదలకు ప్రతీకగా భావించి వినాయకుడికి పూజలు చేస్తారు. ముఖ్యమైన లేదా కొత్త పనులు ప్రారంభించేముందు గణపతి పూజతోనే ప్రారంభిస్తారు. గత రెండేళ్లుగా కోవిడ్ 19 ఆంక్షల కారణంగా వినాయక చవితిని ఘనంగా జరుపుకోలేదు. ఈసారి ఘనంగా జరుపుకునేందుకు సన్నాహాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో చందాల కలెక్షన్స్.. ఎక్కడ మండపాలు కట్టాలి అనే విషయమై ప్రణాళికలు మొదలయ్యాయి.


Tags:    

Similar News