ఫ్యాక్ట్ చెక్: ఒక ముస్లిం వ్యక్తి డ్రైనేజీ నీరు ఉపయోగించి బిర్యానీ వండుతున్న దృశ్యాలు AI ద్వారా సృష్టించారు

ముస్లిం వ్యక్తి డ్రైనేజీ నీరు ఉపయోగించి బిర్యానీ వండుతున్న దృశ్యాలు

Update: 2025-12-30 17:56 GMT


ఈ సంవత్సరం 93 మిలియన్ ఆర్డర్లతో, బిర్యానీ వరుసగా 10వ సంవత్సరం స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా తన కిరీటాన్ని నిలుపుకుంది. రెండవ స్థానంలో బర్గర్, మూడవ స్థానంలో పిజ్జా నిలిచాయి. స్విగ్గీ సంవత్సరాంతపు నివేదిక ప్రకారం, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా కొనసాగింది. బిర్యానీలలో చికెన్ బిర్యానీ 57.7 మిలియన్ ఆర్డర్‌లతో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీగా నిలిచింది. ఈ సంఖ్యలను బట్టి నిమిషానికి 194 బిర్యానీ ఆర్డర్‌ లు ఉన్నాయి. "బిర్యానీ తిరుగులేని రాజు, ట్రెండ్‌లు వచ్చి పోవచ్చు, కానీ ఈ వంటకం పట్ల భారతదేశ ప్రజల ప్రేమ స్థిరంగా ఉంటుందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి" అని స్విగ్గీ ప్రకటనలో తెలిపింది.

ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ నీటిని ఉపయోగించి బిర్యానీ తయారు చేశాడని పలువురు యూజర్లు చెబుతున్నారు. ముస్లిం హోటల్‌లో బిర్యానీ తినడం ఆనందించే ఎవరికైనా ఇది కళ్ళు తెరిపించే సంఘటన అనే వాదనతో కొందరు ఈ పోస్టులను వైరల్ చేస్తున్నారు.

#Tuarka బిర్యాని హే ఇట్లాంటివీ చూసి మనసు పాడు చేసుకోవద్ద ఏదో కొంచెం బిర్యానిల నీళ్ళు తక్కువ పడి ఉండకపోతే బిర్యాని టేస్టీగా ఉండదు అని ఈ నీళ్ళు పోశాడు #BillaMiya మీరు ఏ మాత్రం సంకోచించకుండా తినేయండి’ అంటూ పోస్టులు పెట్టారు.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన లింక్స్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.

ఆర్కైవ్ చేసిన లింక్స్ ఇక్కడ, ఇక్కడ ఉన్నాయి.

వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇవి



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.

వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం వీడియోలోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ లో ఈ సంఘటనకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇలాంటి ఘటన నిజంగా చోటు చేసుకుని ఉంటే తప్పనిసరిగా అది మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.

వీడియోను చూడగా.. ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. బిరియానీని తెరిచిన పాత్రలో వండడం గమనించవచ్చు. నిశితంగా పరిశీలించగా ఆ వైరల్ వీడియోలో కొన్ని అసమానతలు ఉన్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు, వీడియోలోని వ్యక్తి రోడ్డు పక్కన ఉన్న డ్రెయిన్ నుండి గరిటెతో నీటిని తీసివేసినప్పుడు, గరిటె ఆకారం ఒక ఫ్రేమ్ నుండి మరో ఫ్రేమ్‌కు మారుతున్నట్లు కనిపిస్తుంది. క్లిప్ చివరలో గరిటెను మరొక పాత్రపై ఉంచినప్పుడు, అది గాలిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలా ఎన్నో తేడాలు ఆ వీడియోలు ఉన్నాయి.



 




 

ఈ వీడియో AI జనరేటెడ్ అయి ఉండవచ్చని భావించాం. ఈ వీడియోను హైవ్ AI-కంటెంట్ డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి నిజమైనదా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇది AI-జనరేటెడ్ వీడియో అని ఏఐ డిటెక్షన్ టూల్స్ స్పష్టం చేశాయి.


 

ఇక గతంలో కూడా ఇదే తరహా వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీన్ని తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిజనిర్ధారణ చేసింది. అందుకు సంబంధించిన లింక్ ఇక్కడ చూడొచ్చు. 

https://www.telugupost.com/factcheck/fact-check-ai-video-of-making-biriyani-in-big-bowl-shared-with-communal-angle-1598649


కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు.


Claim :  వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఏఐ ద్వారా సృష్టించిన వీడియో ఇది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News