జగన్ తీరు మార్చుకుంటే మేలు...!

Update: 2018-01-15 15:30 GMT

ఓటుకు నోటు కేసు, రామోజీ రావు పై నేను వేసిన కేసు, రాష్ట్ర విభజన పై నేను వేసిన కేసులు పరిశీలిస్తే చాలు కోర్టు ల పనితీరు అర్ధం అవుతుంది. దేశంలో మూడు కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని అంటారు. అందులో రెండుకోట్ల తొంభై లక్షల కేసులు ప్రభుత్వం తన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా పక్కన పెట్టివేసినవే ఉంటాయి. కింది కోర్టుల్లో కొంతవరకు విచారణ సక్రమంగా నడుస్తుంది. హై కోర్టు, సుప్రీం కోర్టులలోనే మరీ ఘోరంగా ఉంటుంది. ఏ కేసు ఏ జడ్జి దగ్గరకు ఎలా వస్తుందో మనకు తెలిసిపోతుంది. ఫలానా న్యాయవాది వాదిస్తే పని అయిపోతుందని టాక్ ఉంటుంది. ఏ జడ్జి వస్తే తీర్పు మనకు అనుకూలంగా వస్తుందో న్యాయవాది ముందే చెప్పేస్తారు. తైలం ఉంటే అంటే డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఎన్నాళ్ళయినా... ఎన్నేళ్లయినా కేసులు సాగతీయవచ్చు. విభజన అశాస్త్రియం అని నేను దాఖలు చేసిన కేసులో విచారణ సుదీర్ఘంగా సాగతీశారు. విభజన జరిగాక తర్వాత చూద్దాం ఇప్పుడు తొందరేమని కోర్టు వ్యాఖ్యానించింది. కేసులు జడ్జీలు ఎవరు చేపట్టాలన్న అంశం కీలకం దీనిపై నిష్పక్ష పాత అనుమానాల కు ఆస్కారం లేని విధానం ఏర్పాటు కావాలి. ప్రస్తుతం హై కోర్టులు సుప్రీం కోర్టు లలో ఏమి నడుస్తుంది. కేసు తెప్పించుకోవడం అంటుంటారు. కేసు తెప్పించుకోవడం అంటే తనకు అనుకూలంగా వుండే జడ్జి బెంచ్ కి వచ్చేలా చూసుకోవడం. అంటే ఇది ఎంత దారుణం. కోర్టులలో సీనియర్ న్యాయవాది కి జూనియర్ కి ఇచ్చే తీర్పుల్లో చాలా తేడాలు ఉంటాయి. జూనియర్ వాదన సరైనది అయినా కూర్చో మని జడ్జి అంటే కూర్చోవాలి. సీనియర్ దగ్గర విషయం లేకపోయినా వారికే గౌరవం ఉంటుంది. డబ్బుంటే చచ్చే వరకు కేసులు సాగతీయవచ్చు . డబ్బు అయిపోతే జైలుకి పోతారు. ఇది అందరికి తెలిసిందే. కోర్టుకు కి వెళ్ళి అక్కడి వ్యవహారాలు పరిశీలించిన వారు ఈ వ్యవస్థ మారాలనే కోరుకోకుండా ఎవ్వరూ వుండరు. దేశంలో జ్యుడిషియరీ వ్యవస్థ ఉన్నంత బలహీనంగా ఏ వ్యవస్థ లేదు. చట్టం అందరికి సమానం అనేది ఈ దేశంలో ఒట్టి మాటగా మిగిలింది.

చట్టం తనపని తాను చేసుకుని వెళుతుందంటే...

పివి నరసింహారావు వంటివారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనే వారు కానీ చట్టం అందరికి సమానమని చెప్పలేదని గుర్తించుకోవాలి. డబ్బున్న వారికే, రాజకీయం పలుకుబడి వున్న వారికే దేశంలో న్యాయస్థానాలను మ్యానేజ్ చేసే సత్తా వుంది. ఈ అంశం అనేక కేసుల్లో రుజువు అయ్యింది. హత్య కేసులో 11 నెలలు శిక్ష అనుభవించిన అమిత్ షా కు బెయిల్ ఇచ్చిన జడ్జి తరువాత కాలంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. ఇది విమర్శలకు దారితీసింది. ఇది కూడా క్విడ్ ప్రోకో లాంటిదే. అమిత్ కేసు విచారిస్తున్న జడ్జి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఇదంతా అనేక అనుమానాలకు ప్రజలకు తావు ఇచ్చేదే. మోడీ ప్రభుత్వం వ్యవస్థలను గాడిన పెట్టాలి. కానీ వారే వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ తమతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అని చూపించే పరిస్థితి కనిపిస్తుంది. డబ్బుంటే కోర్టుల్లో ఏదైనా చేయొచ్చన్నది అందరు భావించేదే . అది జరుగుతుంది కూడా. అనేక మంది మాజీ న్యాయమూర్తులే అనేక ఆరోపణలు న్యాయ వ్యవస్థపై చేయడం చూసాం. దేశంలో ఇప్పటికైనా సామాన్యులకు న్యాయం చేసే వ్యవస్థ ఏర్పాటు కావాలి. నలుగురు జడ్జీలు తిరుగుబాటు చేయడంతో న్యాయవ్యవస్థ గాడిన పడదు. అత్యంత బలహీనంగా మారిన కీలకమైన ఈ వ్యవస్థ పునరుద్ధరణకు నడుం కట్టాలిసిన తరుణం ఆసన్నమైంది అని అన్నారు ఉండవల్లి.

కేసీఆర్ తో చంద్రబాబు పోలిక సరికాదు...

చంద్రబాబు, కేసీఆర్ లను ఏ విషయంలో పోల్చడం సరికాదు. కేంద్రంలో మిత్రపక్షం గా వున్నది బాబు . కేసీఆర్ మిత్రులు కాదు. దాంతో ఆయన మోడీ ప్రభుత్వంతో ఎలా అయినా వ్యవహరించే వీలుంది. బాబు కి అలా కాదు. కేంద్రంలో భాగస్వామి కావడంతో కేసీఆర్ హెచ్చరించినట్లు ఈయన మాట్లాడలేని పరిస్థితి. అలాగే ఏ అంశంలోనైనా వీరిద్దరి మధ్య పోలిక అనవసరం.

కాపుల సమస్య ఏమైంది ...?

ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ ఛైర్మెన్ నివేదిక ఇవ్వకుండానే మరికొందరి సభ్యుల నివేదికతో అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ఏమైంది ఏమి కాలేదు. మంజునాథే లబో దిబో అన్నారు. ఆయన పేరుతో పెట్టిన కమిషన్ ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే ఆమోదించేయడం అంటే అర్ధం చేసుకోవొచ్చు. ఇక్కడ పుష్కరాల్లో తొక్కిసలాట కేసు విచారణను కూడా బాబు అలాగే నీరుగార్చారు. కాపుల రిజర్వేషన్ అంశంలో చట్టబద్ధత ఎక్కడ..? ఇంతవరకు గవర్నర్ కి పంపారో లేదో తెలియదు. ఆరునెలల తరువాత వారు చేసిన తీర్మానాలకు ఎలాగూ విలువ ఉండదు. ఇదంతా రాజకీయ డ్రామా తప్ప మరేమి కాదు.

ఆరోగ్యశ్రీకి వైఎస్ ... ఐటి కి చంద్రబాబే...

ఎవరు ఏమి చెప్పినా పధకాలు పేర్లు మార్చినా ఆరోగ్యశ్రీ అన్నాజజజజ పోలవరం అన్నా 108 అన్నా ,సంక్షేమ పధకాలు చెప్పగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారు. కంప్యూటర్ టెక్నలాజి అంటే చంద్రబాబు గుర్తుకు వస్తారు. అది ప్రజల్లో వుంది.

తండ్రి పేరు చెప్పి దండం పెడితే చాలు .....

వైఎస్ జగన్ పాదయాత్ర లో ఇస్తున్న హామీలు అవసరం లేదు. గతంలో వైఎస్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అధికారంలోకి రాకముందు కన్నా వచ్చాకా తానేమిటో పేదల సంక్షేమానికి కృషి చేసి నిరూపించుకున్నారు. ఆయన మరణం ఆయన్ను ప్రజల్లో దేవుడిగా నిలబెట్టింది. జగన్ తండ్రి పేరు చెప్పి ప్రజలకు దణ్ణం పెడితే చాలు. చంద్రబాబు ఇలా హామీలు ఇచ్చే ఇప్పడు ఇరుక్కున్నారు. రేపు జగన్ అధికారంలోకి వస్తే హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు కు వున్న అనుభవం మీడియా పవర్ ముందు తట్టుకోలేని పరిస్థితి ఎదురౌతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు తీరు మార్చుకోవాలి. కత్తి మహేష్ తదితరులు చేసే విమర్శల విషయంలో సంయమనం పాటించాలి. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినప్పుడు విమర్శలు సహజం. పిలిచి ఎవరు అధికారం తీసుకోమని ఆహ్వానించారు. గతంలో ప్రజారాజ్యం టైం లో హీరో రాజశేఖర్ పై చిరంజీవి కి సంబంధం లేకపోయినా అభిమానులు చూపిన ఉత్సహం ఆ పార్టీకి మచ్చ తెచ్చింది. ఇప్పుడు అలా వ్యవహరిస్తే జనసేన కు పవన్ కి ఇబ్బందే. రాజకీయ పార్టీ అన్నాకా అంతా రెచ్చగొట్టడానికి చూస్తారు. ఇవన్నీ తట్టుకుని మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఉండవల్లి తన వ్యూస్ ను తెలుగుపోస్టు తో పంచుకున్నారు.

 

రాజమండ్రి నుంచి తెలుగుపోస్ట్ ప్రత్యేక ప్రతినిధి

Similar News