ఆ మంత్రి…వస్తే…మేం దూరం

అధికారంలో వైసీపీకి సంబంధించి ప‌లు జిల్లాల్లో నాయ‌కులు తీవ్ర అస‌హనంతో ర‌గిలిపోతున్నారు. నిజానికి జ‌గ‌న్ సీఎం అవ్వాల‌ని, వైసీపీ అధికారంలోకి రావాల‌ని కోరుకున్న నాయ‌కులు నేడు ఆ [more]

Update: 2019-09-01 15:30 GMT

అధికారంలో వైసీపీకి సంబంధించి ప‌లు జిల్లాల్లో నాయ‌కులు తీవ్ర అస‌హనంతో ర‌గిలిపోతున్నారు. నిజానికి జ‌గ‌న్ సీఎం అవ్వాల‌ని, వైసీపీ అధికారంలోకి రావాల‌ని కోరుకున్న నాయ‌కులు నేడు ఆ పార్టీ అధి కారంలోకి వ‌చ్చినా.. జ‌గ‌న్ సీఎం అయినా కూడా పెద్దగా త‌మ‌కు ఒరిగింది ఏమీ లేద‌ని వాపోతున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చేందుకు కీల‌క‌మైన ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకు లే ఈ వ‌రుస‌లో ముందుండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న అనంత పురంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ రెండు స్థానాలు మిన‌హా (హిందూపురం, ఉర‌వ‌కొండ‌) జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది.

వారి ఆలోచనలకు భిన్నంగా….

ఇలా జిల్లా మొత్తం వైసీపీ విజృంభించేందుకు కార‌ణ‌మైంది నిస్సందేహంగా రెడ్డి సామాజిక వ‌ర్గమే. ఈ నేపథ్యంలోనే జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. త‌మ బ‌తుకులు మారిపోతాయ‌ని, త‌మ వ్యాపారాలు బాగుంటాయని, ఇన్నాళ్లు తాము ప‌డిన శ్రమ క‌లిసి వ‌స్తుంద‌ని అనుకున్నారు. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా జ‌గ‌న్ నిర్ణ యాలు ఉండ‌డంతో ఎవ‌రికి వారు త‌మ ప‌నితాము చేసుకుని పోతున్నారు త‌ప్పితే.. పార్టీ కోసం ఎక్కడా ప‌నిచేయ‌డం లేదు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు వ‌స్తున్నా.. మౌనం వ‌హిస్తున్నారు.

బీసీ నేతకు ఇవ్వడమే….

మ‌రి ఇంత‌గా వారు హ‌ర్ట్ అయ్యేందుకు దారి తీసిన ప‌రిస్థితులు ఏంటి? ఇప్పుడు ఈ విష‌యమే చ‌ర్చకు వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ఈ జిల్లా నుంచి జ‌గ‌న్‌ త‌న కేబినెట్‌లో మంత్రిగా బీసీ నాయ‌కుడికి అవ‌కాశం ఇవ్వడ‌మే! పెనుగొండ నుంచి తొలిసారి విజ‌యం సాధించిన మాట‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ కు జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో చోటు ఇచ్చారు. వాస్తవానికి ఈయ‌న బీసీ వ‌ర్గానికి చెందిన కుర బ నాయ‌కుడు. అది కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేశారు.

తొలిసారి గెలిచినా…..

ధ‌ర్మవ‌రం మునిసిపాలిటీలో కౌన్సెల‌ర్ స్థాయి నుంచి ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014 ఎన్నిక‌ల్లో పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శంక‌ర్ నారాయ‌ణ ఈ ఎన్నిక‌ల్లో గెలిచారు. తొలిసారే గెలిచినా బీసీ కోటాలో ఆయ‌న‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. జిల్లాలో వైసీపీ నుంచి మెజార్టీ సంఖ్యలో రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో అనంత వెంక‌ట్రామిరెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లు మంత్రి ప‌ద‌వి ఆశించినా జ‌గ‌న్ మాత్రం శంక‌ర్ నారాయ‌ణ‌ను త‌న కేబినెట్‌లోకి తీసుకున్నారు.

రగిలిపోతూ….

ఇది రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేల‌కు న‌చ్చలేదు. పోనీ శంక‌ర్ నారాయ‌ణ‌కు ప్రతిప‌క్షాల‌పై విరుచుకుప‌డే త‌త్వం ఉందా? జ‌గ‌న్ ప్రభుత్వాన్ని స‌మ‌ర్ధించేలా వ్యాఖ్యలు చేయ‌గ‌ల‌రా? అంటే అది కూడా లేదు. దీంతో అలాంటి నాయ‌కుడికి అవ‌కాశం ఎలా ఇస్తార‌నేది వైసీపీలోకి కీలక నేత‌ల ప్రశ్న. ముఖ్యంగా పార్టీకి అండ‌గా నిలిచిన రెడ్డి వ‌ర్గాన్ని విస్మరించ‌డం ఏంట‌ని? వీరు ర‌గిలిపోతున్నారు. జిల్లాలో గ‌తంలో ఏ పార్టీ గెలిచినా త‌ప్పనిస‌రిగా ఒక రెడ్డి మంత్రిగా ఉండేవార‌ని… ఇప్పుడు ఇంత మంది రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచినా త‌మ‌కు మంత్రి ప‌ద‌వి ఎందుకు ఇవ్వలేద‌ని వారు జ‌గ‌న్‌పై క‌స్సుబుస్సు లాడే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలోనే వారంతా మంత్రికి, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మ‌రి వీరిని జ‌గ‌న్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.

Tags:    

Similar News