ఆర్థిక ఇబ్బందుల్లో వైసీపీ ఎమ్మెల్యే … ఏం చేశారంటే?

ఆమె తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఉన్నత విద్య చ‌దివి ప‌విత్రమైన వృత్తిలో ఉంటూనే ఆమె జ‌గ‌న్ పిలుపు మేర‌కు రాజ‌ధాని ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. [more]

Update: 2019-09-05 11:00 GMT

ఆమె తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఉన్నత విద్య చ‌దివి ప‌విత్రమైన వృత్తిలో ఉంటూనే ఆమె జ‌గ‌న్ పిలుపు మేర‌కు రాజ‌ధాని ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. దీంతో ఇక‌, త‌మ స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతాయ‌ని, పైగా వెన‌క‌బ‌డిన‌ వ‌ర్గానికి చెందిన మహిళ అవ‌డంతో త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. సాధ‌క బాధ‌లు చెప్పుకొనేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆమె వ‌చ్చీ రావడంతోనే ఇంకా ప‌ట్టుమ‌ని వంద రోజులు కూడా గ‌డ‌వ ముందుగానే త‌న నిజ‌స్వరూపాన్ని బ‌య‌ట పెట్టుకున్నారు. ఒక ప‌క్క జ‌గ‌న్ అవినీతికితావులేద‌ని , అక్రమాల‌కు అవ‌కాశం లేద‌ని చెబుతున్నా.. ఈమె మాత్రం వీటిని అత్యంత త్వర‌గా ఒంట బ‌ట్టించుకున్నారు.

క్రషర్ యజమానులతో…

ఈ లేడీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో స్టోన్ క్రష‌ర్ పాయింట్లు ఉన్నాయి. దాదాపు 20 నుంచి 25 వ‌ర‌కు ఇక్కడ ప్లాంట్లు ఉన్నాయి. వీటి నుంచి కంక‌ర రాష్ట్ర వ్యాప్తంగా త‌ర‌లి వెళ్తుంది. వీటిపై క‌న్నేసిన స‌ద‌రు ఎమ్మెల్యే తాను ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంట‌నే క్రష‌ర్ పాయింట్ల య‌జ‌మానుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసింది. దీంతో వారంతా ఉబ్బి త‌బ్బిబ్బయ్యారు. ఇంకేముంది ఇప్పటి వ‌ర‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్యల‌ను ఆమెకు చెప్పాల‌ని, వాటి నుంచి ఎంతో కొంత ఉప‌శ‌మ‌నం పొందాల‌ని భావించారు. ఈ క్రమంలోనే కొంద‌రు ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్లు, అనుమ‌తుల కోసం ప‌డుతున్న తిప్పల‌ను ఆమెకు వివ‌రించేందుకు సిద్ధమ‌య్యారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ….

తీరా స‌మావేశం ప్రారంభ‌మ‌య్యాక‌.. ఎమ్మెల్యే నోటి నుంచి వెలువ‌డిన ఆదేశాలు విని నిర్గాంత పోయారు. “మీరు ఇక్కడ కొన్ని ద‌శాబ్దాలుగా క్రష‌ర్ పాయింట్లు న‌డుపుతున్నారు. ఇప్పటి వ‌ర‌కు మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియ‌దు. ఇక నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. అయితే, మీరు ఒక ప‌నిచేయాలి. నేను కూడా ఎమ్మెల్యే అయ్యేందుకు చాలా క‌ష్టప‌డ్డాను. టికెట్ తెచ్చుకోవ‌డం ద‌గ్గర నుంచి ఎన్నిక‌ల్లో ప్రచారం వ‌ర‌కు కూడా చాలానే ఖ‌ర్చు పెట్టాను. ఇప్పుడు నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. న‌న్ను మీరే ఆదుకోవాలి“ అంటూ ప్రారంభించిన ఆ లేడీ ఎమ్మెల్యే ప్రసంగం.. ఈ య‌జ‌మానుల‌కు టార్గెట్ పెట్టేవ‌ర‌కు వెళ్లింది.

ఏడాదికి ఇంత అంటూ….

ఒక్కొక్క క్రష‌ర్ పాయింట్ య‌జ‌మానీ.. కూడా ఏడాదికి 15 నుంచి 20 ల‌క్షలు త‌మ‌కు ఇవ్వాల‌ని వైసీపీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. మొత్తంగా ఏడాది 4 కోట్ల రూపాయ‌ల నుంచి 5 కోట్ల వ‌ర‌కు పిండుకునే ప‌నికి శ్రీకారం చుట్టారు. అయితే, అమ‌రావ‌తి నిర్మాణాలు సాగుతున్న క్రమంలో టీడీపీ నేత‌ల‌కు తాము ఇలానే ఇచ్చి చాలా న‌ష్టాల్లో ఉన్నామ‌ని చాలా మంది య‌జ‌మానులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు., అయిన‌ప్పటికీ.. ఈ విష‌యాలు త‌న‌కు చెప్పొద్దని, త‌న‌కు క‌ప్పం క‌ట్టాల్సిందేన‌ని ఆమె భీష్మించారు. వీరిలో కొంద‌రు వైసీపీ సానుభూతి ప‌రులు కూడా ఉండ‌డంతో వీరిని ప‌క్క న పెట్టినా.. టీడీపీకి అనుకూలంగా ఉన్నవారు మాత్రం త‌మ ప‌రిస్థితి ఏంట‌ని త‌ల్లడిల్లుతున్నారు. అయితే, ఇప్పుడు రాజ‌ధాని ప‌నులు ఆగిపోవ‌డంతో ఈ విష‌యం స‌ద్దుమ‌ణిగింది. కానీ, భ‌విష్యత్తులో మాత్రం వీరికి తిప్పలు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News