డైల్యూట్ చేసి డిఫెన్స్ లో పడేసేందుకే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే మరింత రెచ్చిపోతారని వైసీపీ భావిస్తోంది. తాము మౌనంగా ఉంటే చేతకాని తనంగా భావిస్తారని వైసీపీ అధినేత జగన్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే మరింత రెచ్చిపోతారని వైసీపీ భావిస్తోంది. తాము మౌనంగా ఉంటే చేతకాని తనంగా భావిస్తారని వైసీపీ అధినేత జగన్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబ దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే మరింత రెచ్చిపోతారని వైసీపీ భావిస్తోంది. తాము మౌనంగా ఉంటే చేతకాని తనంగా భావిస్తారని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుని చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు కొద్దిరోజులు ముందే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయడంతో ఈ ప్రచారం నిజమనుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లోనే….
కానీ అసెంబ్లీ సమావేశాలు ముగిసినా ఏ ఒక్క టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ వైపు చూడలేదు. పైగా వైసీపీ పై చంద్రబాబు మరింత కసిగా వెళుతున్నారు. ఇసుక, ఇంగ్లీష్ మీడియంలపైనా చంద్రబాబు ఎగ్రస్సివ్ గా వెళ్లారు. తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదన పై కూడా చంద్రబాబు సీరియస్ గా తీసున్నారు. ఏ పార్టీ అధినేత తీసుకోనంత రిస్క్ తీసుకున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబు పట్టుబడుతున్నారు. దీంతో చంద్రబాబును రాజధాని విషయంలో కట్టడి చేయడానికి వైసీపీ మళ్లీ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రియను స్టార్ట్ చేసినట్లు కన్పిస్తుంది.
గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే…..
గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి ముఖ్యమంత్రి జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలకు ఒక సంకేతాన్ని పంపింది. వల్లభనేని వంశీని స్వతంత్ర సభ్యుడిగా గుర్తిస్తూ ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కూడా కేటాయించింది. దీంతో వైసీపీలో చేరకుండానే ఆ పార్టీలో అనధికార సభ్యుడిగా కొనసాగే వీలును జగన్ కల్పించినట్లయింది. అందువల్లనే టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు చూస్తూ తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి పరుగులు తీస్తున్నారని చెప్పక తప్పదు.
రెండు రోజుల్లో మరి కొందరు….
నిజానికి మద్దాలి గిరిని క్యాంపు కార్యాలయానికి రప్పించడంలో వైసీపీకి మరో ప్రయోజనం కూడా దక్కుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రాజధాని తరలింపు అంశంపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను తమలో కలుపుకోవడం ద్వారా చంద్రబాబును నేతలే నమ్మడం లేదన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని వైసీపీ భావిస్తున్నట్లుంది. మరో రెండు రోజుల్లో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేతలు కూడా నేరుగా వైసీపీలో చేరే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. జగన్ రాజధాని తరలింపు అంశాన్ని డైల్యూూట్ చేసి చంద్రబాబును డిఫెన్స్ లో పడేసేందుకే టీడీపీ ఎమ్మెల్యేలను క్యాంపు కార్యాలయానికి రప్పిస్తున్నారు.