కొట్టుకు ఛస్తున్నారు జగనూ

రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా గుంటూరులో అధికార వైసీపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు ర‌గులుతున్నాయా ? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకునే వ‌ర‌కు [more]

Update: 2019-10-02 12:30 GMT

రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా గుంటూరులో అధికార వైసీపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు ర‌గులుతున్నాయా ? ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకునే వ‌ర‌కు ప‌రిస్థితులు చేజారుతున్నాయా ? ఎవరికి వారే పెత్తనం చ‌లాయించాల‌ని చూస్తున్నారా ? క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని ఏ ఒక్కరూ భావించ‌డం లేదా ? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరులో కేవ‌లం రెండు నియోజ‌క‌వ‌ర్గాలు రేప‌ల్లె, గుంటూరు వెస్ట్ త‌ప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు, ఎంపీ స్థానాల్లో వైసీపీ పాగా వేసింది.

బలమైన పార్టీగా…..

దీంతో బ‌ల‌మైన పార్టీగా వైసీపీ జిల్లాలో చ‌క్రం తిప్పే అవ‌కాశం వ‌చ్చింది. వైసీపీని బ‌లోపేతం చేసుకునే ఛాన్స్ కూడా ద‌క్కింది. అయితే, వైసీపీ నాయ‌కులు మాత్రం త‌మ ఇష్టానుసారం వ్యవ‌హ‌రిస్తూ.. పార్టీ ప‌రువును బ‌జారున ప‌డేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో జ‌రిగిన ర‌గ‌డ‌ల‌ను వ‌రుస క్రమంలో ప‌రిశీలిస్తే.. ఏ ఇద్దరు నాయ‌కులు కూడా స‌వ్యంగా లేర‌నే అనిపిస్తుండ‌డం విశేషం. మ‌రి దీనిని ఎవ‌రు ఎలా స‌రిదిద్దుతుతారో చూడాలి.

మ‌ర్రి వ‌ర్సెస్ రజనీ…..

వైసీపీ సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ త‌న టికెట్ త్యాగం చేసి మ‌రీ విడ‌ద‌ల ర‌జ‌నీకి చిల‌క‌లూరిపేట నుంచి టికెట్ ఇచ్చేలా చేశారు. అయితే, ఇంత త్యాగం చేసిన మ‌ర్రికి ఇక్కడి నుంచి గెలిచిన ర‌జనీ క‌నీస గౌర‌వం కూడా ఇవ్వడం లేదు. ఎన్నిక‌ల‌కుముందు ఉన్న గౌర‌వం, మ‌ర్యాద ఇప్పుడు క‌నీసం లేకుండా ఆమె వ్యవ‌హ‌రిస్తోంది. దీంతో ఇద్దరి మ‌ధ్య ఉప్పు-నిప్పుమాదిరిగా ఉంది వ్యవ‌హారం. చిల‌క‌లూరిపేట‌లో ఇప్పుడు వైసీపీలో ఈ రెండు గ్రూపుల మ‌ధ్య గొడ‌వ తారాస్థాయిలో ఉంది. ఇక‌, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ టికెట్ త్యాగం చేస్తే.. ఎమ్మెల్సీ ఇస్తాన‌ని, మంత్రిని చేస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఇప్పటి వ‌ర‌కు ఆ ఊసే ఎత్తలేదు. ఇది కూడా మ‌ర్రిని ఇన్ స‌ల్ట్ చేసేందుకు విడ‌ద‌ల వాడుకుంటున్న అస్త్రం.

విడ‌ద‌ల వ‌ర్సెస్ లావు….

న‌ర‌స‌రావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవ‌రాయులు రాజ‌కీయంగా కానీ, నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి విష‌యంలో కానీ, సీనియ‌ర్ నేత అయిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను క‌లుస్తున్నారు. ప‌లు కార్యక్రమాల్లో ఆయ‌న‌ను భాగ‌స్వామిని చేస్తున్నారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం త‌న‌ను పిల‌వ‌డం లేద‌ని విడ‌ద‌ల ర‌జ‌నీ ఎంపీ లావుపై అక్కసు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే లావును టార్గెట్ చేసేందుకు ర‌జ‌నీ బీసీ కార్డు తెర‌మీద‌కు తెస్తున్నారు.

శ్రీదేవి వ‌ర్సెస్ విడ‌ద‌ల‌….

ఇది ఇద్దరు లేడీ ఎమ్మెల్యేల గొడ‌వ‌. తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవికి ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఎంతో హెల్ప్ చేశారు. దీంతో ఆమె కూడా త‌న నియోజ‌క‌వ‌ర్గం కాక‌పోయినా.. చిల‌క‌లూరి పేటకు వ‌చ్చి ఆయ‌న స‌ల‌హాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, స్థానిక ఎమ్మెల్యే విడ‌ద‌ల.. రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజుకు విష్ చేయ‌క‌పోయినా.. శ్రీదేవి వెళ్లి పాదాభివంద‌నం చేసి మ‌రీ శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై విడ‌ద‌ల గుస్సాగా ఉన్నారు. ఇటీవ‌ల తాడికొండ‌లో జ‌రిగిన కార్యక్రమంలో పాల్గొన్న విడ‌ద‌లకు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ నేత‌లు ఎక్కువ ప్రయార్టీ ఇచ్చి… శ్రీదేవిని ప‌క్కన పెట్టి అంతా తానే అయి వ్యవ‌హ‌రించ‌డంతో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది.

నందిగం వ‌ర్సెస్ శ్రీదేవి….

బాప‌ట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఇసుక అక్రమ తొవ్వకాలు ప్రోత్సహిస్తున్నారంటూ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేసింది. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుతున్న ఈ ఘ‌ట‌న‌ల‌కు క‌నీసం త‌న నుంచి ఎలాంటి స‌మాధానం కోర‌డం లేద‌ని ఆమె ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఆ త‌ర్వాత ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఫ్లెక్సీల వివాదం కూడా బాగా ముదిరి పాకాన ప‌డింది. దీంతో అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యేల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది.

ఏసుర‌త్నం వ‌ర్సెస్‌ లేళ్ల అప్పిరెడ్డి…

గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి ఏసుర‌త్నం వ‌ర్సెస్ ఇక్కడ ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డికి మ‌ధ్య వివాదం జ‌రుగుతోంది. ఓట‌మిపాలైనా.. త‌నదే ఆదిప‌త్యం సాగాల‌ని ఏసుర‌త్నం చూడ‌డంతో లేళ్ల ఆగ్రహంతో ఉన్నారు. మ‌రోప‌క్క, త‌న‌ను ఓడించేందుకు మ‌రో నేత మోదుగ‌ల వేణుగోపాల రెడ్డి కూడా ప్రయ‌త్నించార‌ని ఏసుర‌త్నం.. అటు లేళ్ల, ఇటు మోదుగుల‌పై కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో నాయ‌కుల మ‌ధ్య ఏమాత్రం స‌ఖ్యత క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ వివాదాలు ర‌చ్చకెక్కక ముందే జ‌గ‌న్ మేల్కొని ప‌రిష్కరించ‌డం మేల‌ని సూచిస్తున్నారు.

Tags:    

Similar News