ఆయనను మార్చాలని జగన్?

పార్టీలో నేత‌ల‌ను మార్చాల‌ని అనుకున్నప్పుడు సాధార‌ణంగా ఇప్పటికే ఉన్న నాయ‌కుల లోపాల‌ను ఎత్తి చూప‌డం స‌ర్వసాధార‌ణం. అయితే, ఇది గ‌త టీడీపీకి క‌లిసి వ‌చ్చిన ఆన‌వాయితీ. కానీ, [more]

Update: 2020-02-01 14:30 GMT

పార్టీలో నేత‌ల‌ను మార్చాల‌ని అనుకున్నప్పుడు సాధార‌ణంగా ఇప్పటికే ఉన్న నాయ‌కుల లోపాల‌ను ఎత్తి చూప‌డం స‌ర్వసాధార‌ణం. అయితే, ఇది గ‌త టీడీపీకి క‌లిసి వ‌చ్చిన ఆన‌వాయితీ. కానీ, వైసీపీలో మాత్రం చెప్పకుండానే ఇంచార్జ్‌ల‌ను మార్చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గాలే కాదు జిల్లాల‌కు కూడా ఇంచార్జ్‌ల‌ను మార్చేసిన ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా మాత్రం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వైసీపీ.. టీడీపీ వ్యూహాన్ని తెర‌మీదికి తెచ్చింది.

గంగరాజు తనయుడికి….

ఇప్పటి వ‌ర‌కు ఇంచార్జ్‌గా ఉన్న పీవీఎల్‌ నర్శింహరాజును త్వర‌లోనే మార్చాల‌ని అధిష్టానం నిర్ణయించింది. దీనికి ప్రధాన కార‌ణం ఇటీవ‌లే పార్టీలోకి వ‌చ్చిన మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుమారుడు రంగ‌రాజుకు ఇక్కడ ప‌గ్గాలు అప్పగించాల‌ని నిర్ణయించుకోవ‌డ‌మే. ఈ ష‌ర‌తుపైనే రంగ‌రాజు పార్టీలో చేరారు. ఆయ‌న పార్టీలో చేరే స‌మ‌యంలోనే ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌గ్గాలు చేతులు మార‌తాయ‌నే ప్రచారం సాగింది.

మంత్రులను పంపి మరీ…

అయితే, వెనువెంట‌నే న‌ర్శింహ‌రాజును తొల‌గిస్తే.. స్థానికంగా ఇబ్బందులు వ‌స్తాయ‌ని అనుకున్నారో ఏమో.. అనూహ్యంగా ఇక్కడి ప‌రిస్థితుల‌ను ప్రస్తావించారు. నిజానికి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితుల‌ను ఎప్ప టిక‌ప్పుడు స‌మీక్షించే అల‌వాటు వైసీపీకి లేనేలేదు. ఏదైనా భారీ ఎత్తున మార్పులు జ‌రిగితేనే త‌ప్ప ఎప్పుడూ ఇలా స‌మీక్షలు చేయ‌డం, రిపోర్టులు తెప్పించుకోవ‌డం చేయ‌లేదు.ఇప్పుడు ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మార్పులు చేయాల‌ని ముందుగానే నిర్ణయించుకున్న వైసీపీ ఇక్కడ‌కు మంత్రులు, పేర్ని నాని, కొడాలి నానిల‌ను పంపి నియోజ‌క‌వ‌ర్గంపై స‌మీక్ష చేప‌ట్టింది. ఇక‌, ఎలాగూ ఇక్కడ ఇంచార్జ్‌గా రంగ‌రాజును నియ‌మించాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో న‌ర్శింహ‌రాజు నాయకత్వంలోని త‌ప్పుల‌ను నేరుగా మంత్రి నాని బ‌హిర్గతం చేశారు.

మార్చేందుకేనా?

ఇక్కడ ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవ హరిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను వీడకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.. అని విష‌యాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పేశారు. దీంతో రామ‌రాజు వ‌ర్గం సంబ‌రాల్లో మునిగిపోయింది. అదే స‌మ‌యంలో న‌ర్శింహ‌రాజు స‌ర్ది చెప్పబోయినా మంత్రులు ఇద్దరూ కూడా ఆయ‌న‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను గెలుచుకున్నా ఉండిలో మాత్రం గెల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఇప్పటి వ‌ర‌కు ఎందుకు అన్వేషించ‌లేక పోయారు? అని ప్రశ్నించారు. దీంతో న‌ర్శింహ‌రాజు మౌనం పాటించారు. మొత్తంగా చూస్తే.. ఇక్కడ త్వ‌ర‌లోనే ఇంచార్జ్ మార్పు ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News