బిగ్ బ్రేకింగ్ : జగన్ కు భారీ షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు [more]

Update: 2019-11-01 05:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. జగన్ పిటీషన్ పై సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వ్యక్తిగత హాజరునుంచి జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఎంపీగా ఉన్నప్పుడే జగన్ సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు కూడా అదే చేస్తారని అభిప్రాయపడింది. పరిస్థితులు మారాయి కాని నేరాలు మారలేదని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరు నుంచి మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో ముఖ్యమంత్రి హోదాలో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సిన పరిస్థితి తలెత్తింది.

Tags:    

Similar News