దొనకొండ దూసుకుపోతుందటగా

ప్రకాశం జిల్లా దొన‌కొండ‌. వాస్తవానికి ఇక్క‌డ నీటికి కూడా చాలా ఇబ్బంది. రైతుల మాట‌లో చెప్పాలంటే.. ఇది బీడు భూమి. అయితే, ఇప్పుడు ఇదే.. హాట్ టాపిక్ [more]

Update: 2019-08-23 02:00 GMT

ప్రకాశం జిల్లా దొన‌కొండ‌. వాస్తవానికి ఇక్క‌డ నీటికి కూడా చాలా ఇబ్బంది. రైతుల మాట‌లో చెప్పాలంటే.. ఇది బీడు భూమి. అయితే, ఇప్పుడు ఇదే.. హాట్ టాపిక్ అయింది. ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి దొన‌కొండకు మారుస్తార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డమే దీనికి ప్రధాన కార‌ణం. అదే స‌మ‌యంలో వైసీపీ నేత‌ల‌కు దొన‌కొండ అంటే ఎందుకత ప్రేమ అనే విష‌యం కూడాప్రతిప‌క్షం టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. విష‌యంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాలోని దొన‌కొండ ప్రాంతంలో రాజ‌ధాని ఏర్పాటు చేస్తే.. బాగుంటుంద‌ని 2014లో శివ‌రామ‌కృష్ణ క‌మిటీ త‌న నివేదిక‌లో స్పష్టం చేసింది.

అమరావతి వైపు బాబు…..

అయితే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. నీరు లేనిచోట రాజ‌ధానా ? బీడు భూముల్లో ఎవ‌రైనా వ‌చ్చి పెట్టుబ‌డులు పెడ‌తారా ? అంటూ ఆయ‌న ఆక్రోశించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కృష్ణా న‌దిని ఆనుకుని ఉన్న 12 గ్రామాల‌ను తొల‌గించి, రైతుల‌తో మాట్లాడి భూ స‌మీక‌ర‌ణ చేసి ఇక్కడ రాజధానిని ప్రక‌టించారు. ఆయ‌న హ‌యాలో అనేక ప్లాన్లు కూడా తెర‌మీద‌కి వ‌చ్చాయి. సింగ‌పూర్ కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకున్నారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అమ‌రావ‌తి విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ పెద్దగా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

సత్తిబాబు ప్రకటనతో….

అంతేకాదు, బాబు హ‌యాంలో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేశారు. ఇప్పుడు అమ‌రావ‌తిలోనూ ప‌నులు చేసేవారు క‌రువ‌య్యారు. ప‌నులు కూడా మూల‌న ప‌డ్డాయి. దీనికితోడు తాజాగా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చేసిన ప్రక‌ట‌న‌తో అంద‌రి దృష్టీ దొన‌కొండ‌పై ప‌డింది. ప్రధాన‌ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఉంటుంద‌ని, ప్రభుత్వ కార్యక‌లాపాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే జ‌రుగతాయ‌ని, అయితే, మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేసి రెండో రాజ‌ధాని లేదా రాజ‌ధానిలో పారిశ్రామిక ప్రగ‌తిని దొన‌కొండ‌లో ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ ప్రభుత్వం స‌మాయ‌త్తమ‌యింద‌నేది తెర‌మీదికి వ‌స్తోంది.

అదే వ్యూహంతో….

దీనికి రెండు ప్రధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన కీల‌క నేత‌లు రాజ‌ధాని దొన‌కొండ‌లోనే వ‌స్తుంద‌ని భావించి అక్కడ భారీ ఎత్తున భూములు కొన్నారు. వైసీపీ ప్రభుత్వ ఏర్పాటులో వీరంతా త‌లోచేయి వేశారు. ఇప్పుడు వీరికి న్యాయం జ‌ర‌గాలి., రెండు .. ప్రకాశంలో అభివృద్ధి ఫ‌లాలు అందించ‌డం ద్వారా ఈ జిల్లాలో వైసీపీ శాశ్వతంగా నిల‌బ‌డిపోవాలి. అదే స‌మ‌యంలో దీనిని ఆనుకుని ఉన్న సీమ జిల్లాల్లోనూ ప్రభావితం చేసేలా ఎద‌గాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నట్టు స‌మాచారం. ఇదే వ్యూహంతో ఆయ‌న దొన‌కొండ తీగ‌ను లాగుతున్నార‌ని తెలుస్తోంది. అయితే, టీడీపీ నుంచి వ్యతిరేక‌త అప్పుడే స్టార్టయిన నేప‌థ్యంలో ఎలాముందుకు వెళ్తారో చూడాలి.

Tags:    

Similar News