జగన్ కి తండ్రి స్నేహితులే శత్రువులుగా మారారా?
జగన్ విషయంలో ఏంటో కానీ వైఎస్సార్ సన్నిహితులే ముందుండి విమర్శిస్తారు. తండ్రిని మెచ్చుకున్న వారు జగన్ ని చూసి నొచ్చుకుంటారు. జగన్ కి వారితో ఎందుకో సరైన [more]
జగన్ విషయంలో ఏంటో కానీ వైఎస్సార్ సన్నిహితులే ముందుండి విమర్శిస్తారు. తండ్రిని మెచ్చుకున్న వారు జగన్ ని చూసి నొచ్చుకుంటారు. జగన్ కి వారితో ఎందుకో సరైన [more]
జగన్ విషయంలో ఏంటో కానీ వైఎస్సార్ సన్నిహితులే ముందుండి విమర్శిస్తారు. తండ్రిని మెచ్చుకున్న వారు జగన్ ని చూసి నొచ్చుకుంటారు. జగన్ కి వారితో ఎందుకో సరైన అవగాహన లేదో లేక కావాలని దూరం పెట్టారో తెలియదు కానీ జగన్ ని గట్టిగానే తగులుకుంటున్నారు నిన్నటి దాకా పీసీసీ చీఫ్ గా పనిచసిన రఘువీరారెడ్డి జగన్ మీదనే విమర్శలు ఎక్కువగా చేసేవారు. ఆనాడు జగన్ విపక్షంలో ఉన్నా కూడా రఘువీరా అసలు విడిచిపెట్టేవారు కారు. జగన్ కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచారు అంటూ దారుణంగా మాట్లాడేవారు.
బలహీనమైన సీఎం….
దేశంలో అత్యంత బలహీనమైన సీఎం ఎవరైనా ఉంటే అది జగన్ మాత్రమేనని తూకమేసి మరీ చెప్పేశారు పీసీసీ చీఫ్ సాకె శైలజానాధ్. జగన్ కి మోడీని చూస్తే వణుకుట. అందువల్ల ఆయన ఏపీ ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారు అంటున్నారు. రైతుల గొంతు కోసే వ్యవసాయ బిల్లులకు బేషరతుగా మద్దతు ఇచ్చిన జగన్ తండ్రి వైఎస్సార్ ఆశయాలను కూడా తుంగలోకి తొక్కేశారని శైలజానాధ్ గట్టిగానే అంటున్నారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉచిత విద్యుత్ పధకాన్ని నీరు కారుస్తున్నారు అంటూ ద్వజమెత్త్తారు ఆయన.
అదే నిజమా…?
కాంగ్రెస్ లో శైలాజానాధ్ సహా చాలా మంది నేతలకు వైఎస్సార్ దేవుడు. ఆయన వీరిని చేరదీసి మంత్రులుగా కూడా చేశారు. అదే తండ్రి కొడుకు జగన్ మాత్రం భయంకరమైన శత్రువు. దానికి కారణం జగన్ వారిని అలా అక్కడే ఉంచేసారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా జగన్ సొంతం చేసుకున్నారు. ఆ మీదట చాలా మంది నాయకులను కూడా వైసీపీలోకి తీసుకున్నారు. కొందరిని మాత్రం ఆయన అసలు రానివ్వలేదు. వారిలో రఘువీరా, సాకే లాంటి వారు ఉన్నారని అంటారు. దానికి స్థానిక సమీకరణలు కూడా కుదరకపోవడం ఒక కారణం అయితే తండ్రితో పనిచేసిన వారిని ఎక్కువ మందిని తన వెంట తెచ్చుకోకూడదు అని ఒక ప్రిన్సిపుల్ జగన్ పెట్టుకోవడం మరో కారణం అంటారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వారు కొంత మినహాయింపు అయినా చాలా మంది వైస్సార్ భక్తులకు జగన్ చోటివ్వకపోవడానికి వారి అతి కాంగ్రెస్ భక్తి కూడా మరో కారణం అంటారు.
ఉండవల్లి సైతం ….
ఇక వైఎస్సార్ ప్రాపకంతో రాజకీయంగా ఎదిగిన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు ఈ మధ్య వరకూ జగన్ ని సపోర్ట్ చేసినా కూడా తాజాగా వారు స్టాండ్ మార్చేశారు. జగన్ ని చంద్రబాబు కంటే ఎక్కువగా చేసుకుని నిందిస్తున్నారు. వైఎస్సార్ వేరు జగన్ వేరు అంటూ తేడాలు కూడా మీడియా ముఖంగా చెబుతున్నారు. ఇదే వరసలో వైఎస్సార్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే వైఎస్సార్ కి ఇష్టులు అయిన వారికి జగన్ దుష్టుడుగా కనిపించడం రాజకీయ విచిత్రంగానే చూడాలి. మరి తేడా ఎక్కడ వచ్చిందో కానీ వైఎస్సార్ ని మహానుభావుడు అంటూ ఇప్పటికీ పొగుడుతున్న వారు జగన్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తేడాను జనం కనుక గమనిస్తే జగన్ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది అన్న మాట కూడా ఉంది.