ఇక వీళ్లు పార్టీని వదిలేస్తారా?
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అధికార పార్టీకి ఇప్పటి వరకూ అయితే [more]
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అధికార పార్టీకి ఇప్పటి వరకూ అయితే [more]
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అధికార పార్టీకి ఇప్పటి వరకూ అయితే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో జగన్ పార్టీ బలంగా ఉండటంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఆ పార్టీకే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉండటం వాటికి మైనస్ గా చెప్పాలి.
తిరుపతి ఉప ఎన్నిక తర్వాత…..
అయితే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల తర్వాత వైసీపీలోనూ అసంతృప్తులు మరింత ఎక్కువవుతాయని అంటున్నారు. జగన్ ను నమ్మి వచ్చినా ఇప్పటి వరకూ ఎలాంటి పదవులు దక్కని నేతలు పక్క పార్టీ వైపు చూడక తప్పదన్న అంచనాలు అయితే బలంగా ఉన్నాయి. వీరిలో ప్రముఖుల పేర్లు కూడా విన్పిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపట్ల ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పదవులు దక్కవని….
వారు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ తమకు పదవులు రాలేదన్న ఆవేదనలో ఉన్నారు. తాము పార్టీలోకి వచ్చినా తమకంటే తర్వాత వచ్చిన వారికి సామాజిక వర్గాల సమీకరణాల పేరుతో జగన్ పెద్దపీట వేయడాన్ని కూడా వీరు తట్టుకోలేకపోతున్నారు. భవిష్యత్ లో జగన్ వీరి వైపు చూసే అవకాశమూ లేదంటున్నారు. జగన్ ఒక కోటరీలో చిక్కుకున్నారని, దీంతో తమకు పదవులు దక్కడం కష్టమేనని వారు ఫిక్స్ అయిపోయారు.
జంపింగ్ లు తప్పవా?
అందుకే తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఫలితాలు ఎలా ఉన్నా జంపింగ్ లు తప్పవంటారు. అప్పటికి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. పొరుగున ఉన్న తెలంగాణలోనూ దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కొందరు టీఆర్ఎస్ ను వీడివెళ్లిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ కు నమ్మకమైన వాళ్లే పార్టీని వీడి వెళ్లిపోవడం అక్కడ చర్చనీయాంశమైంది. దీంతో తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తర్వాత కూడా ఏపీలో అధికార పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఉంటాయన్న చర్చ జోరుగా సాగుతుంది.