జగన్ “కొత్త” ఆలోచన… అదే ఫైనల్ అట

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక లో అక్కడ అధికార పార్టీ ఓటమి చెందడంతో జాగ్రత్తగా ఈ ఎన్నికలకు వెళ్లాలని [more]

Update: 2020-11-20 02:00 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక లో అక్కడ అధికార పార్టీ ఓటమి చెందడంతో జాగ్రత్తగా ఈ ఎన్నికలకు వెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఎట్టిపరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలిచి తీరాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ మేరకు అభ్యర్థి విషయంలోనూ జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. సంప్రదాయానికి భిన్నంగా జగన్ వ్యవహరిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది.

సానుభూతి వర్క్ అవుట్ కాదని….

తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. సంప్రదాయంగా మరణించిన సభ్యుల కుటుంబాలకే టిక్కెట్ ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సానుభూతి ఓట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఇదే విషయం స్పష్టమయింది. దీంతో తిరుపతి ఉప ఎన్నికపై జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది.

కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని…..

బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచి కాకుండా కొత్త వ్యక్తికి టిక్కెట్ ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో పోటీకి సిద్ధమయ్యే వారు ఎవరూ లేకపోవడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇది ఫైనల్ నిర్ణయం కాదని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత దీనిపై ఫైనల్ డెసిషన్ కు వస్తారని అంటున్నారు.

మంత్రులదే బాధ్యత….?

మరోవైపు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇన్ ఛార్జిలుగా నియమించాలని జగన్ భావిస్తున్నారు. అక్కడ వైసీపీకి పూర్తి స్థాయి మెజారిటీ తీసుకు వచ్చే బాధ్యతను మంత్రులకే జగన్ అప్పగించనున్నారని తెలిసింది. మంత్రులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు. ఇలా జగన్ తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

Tags:    

Similar News