తేడా వస్తే తేల్చుకునేందుకే రెడీ అయ్యారా?

పోలవరం ప్రాజెక్టు జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కోత విధిస్తూ కేంద్ర [more]

Update: 2020-11-09 12:30 GMT

పోలవరం ప్రాజెక్టు జగన్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపైనే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్ తో పాటు రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దానిని పూర్తి చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ దొంగనాటకాల్లో ఇది ఒక భాగమే.

మౌనంగా ఉంటే…..

అయితే జగన్ ఈ సమయంలోనూ మౌనంగా ఉన్నారంటే ఆ పాపం ఆయనకు అంటుకోక తప్పదు. జగన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ఏడు పేజీల లేఖ రాశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. నలభై వేల కోట్ల నిధులు ఇంకా రావాల్సి ఉందని కూడా జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖతో జగన్ సరిపెడతారా? లేక కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే మరో నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

లేఖ రాసిన……

లేఖ రాసిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవాలనుకుంటున్నారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి వచ్చారు. ఎన్డీఏలో చేరమని ప్రధాని మోదీ జగన్ ను కోరారని, కానీ ఆ ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. జగన్ ప్రధానితో కలసి వచ్చిన తర్వాతనే పోలవరం నిధుల కోత విషయం బయటపడింది. దీంతో మరోసారి జగన్ మోదీని కలసి పోలవరం పై చర్చించాలని భావిస్తున్నారు.

ఢిల్లీ పర్యటన తర్వాత…

మోదీ అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే జగన్ టీం ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తుంది. మోదీని తాను కలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తగ్గకపోతే జగన్ సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే అవకాశముంది. అలాగే న్యాయపరంగా కూడా మోదీని కలిసిన తర్వాతనే పోరాడాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరపరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News