జగన్ ను కూల్ చేయడం ఎలా? ఆరితేరిన నేతలు

ఒక‌వైపు నేత‌లు.. మ‌రో వైపు అధికారుల దూకుడుతో జ‌గ‌న్ స‌ర్కారు విల‌విలాడుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చంద్రబాబు స‌ర్కారులో ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని [more]

Update: 2020-11-01 12:30 GMT

ఒక‌వైపు నేత‌లు.. మ‌రో వైపు అధికారుల దూకుడుతో జ‌గ‌న్ స‌ర్కారు విల‌విలాడుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చంద్రబాబు స‌ర్కారులో ఇలాంటి ప‌రిస్థితి లేద‌ని చెబుతున్నారు. నేత‌లు దూకుడుగా ఉన్నా.. అదికారులు మాత్రం సీఎం చంద్రబాబు విష‌యంలో చాలా జాగ్రత్తగా వ్యవహ‌రించేవార‌ని.. కానీ, ఇప్పుడు మాత్రం అధికారులు సైతం ల‌క్ష్మణ రేఖ‌లు దాటుతున్నార‌ని చెబుతున్నారు. నేత‌ల విష‌యాన్ని తీసుకుంటే.. ఎవ‌రిదారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. తాము ఏం చేసినా.. జ‌గ‌న్‌కు ఒక పాలాభిషేకం చేస్తే స‌రిపోతుంద‌ని అంటున్నారు.

జగన్ సీరియస్ అవుతారనుకుంటే?

ఇదే త‌ర‌హా రాజ‌కీయం నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ‌గా ఉంది. చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌లు దూకుడుగా ఉన్నారు. పార్టీ ప‌రువు పోయినా ప‌‌ర్లేదు.. మా ప‌నులు అయితే చాలు అన్న విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఎస్సీల‌పై దాడులు, అధికారుల‌పై ఒత్తిళ్లు ప్రస్తుతం కామ‌న్‌గా క‌నిపిస్తున్నాయి. ఫిర్యాదులు వ‌చ్చిన ప్పుడు సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అవుతార‌ని అనుకున్నప్పుడు మాత్రం ఆయ‌న పేరిట అన్నదానాలు.. లేదంటే పాలాభిషేకాలు చేసి.. ఆగ్రహాన్ని చ‌ల్లార్చు తున్నారు. ఇటీవ‌ల తూర్పుగోదావ‌రిలో ఎస్సీ యువకు డికి శిరోముండ‌నం ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌లు అలానే చేశారు.

అధికారులు సయితం…..

ఇక‌, అధికారుల విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో త‌మ‌కు ప‌నులు చేయించుకునేందుకు మంత్రుల‌ను కాకాప‌ట్టేవారు. లేదా ఎమ్మెల్యేల‌కు మొర పెట్టుకునేవారు . కానీ. ఇప్పుడు నేరుగా జ‌గ‌న్ చిత్రప‌టాల‌కు పూజ‌లు చేస్తున్నారు. అది కూడా కార్యాల‌యాల్లోనే చేస్తుండ‌డం వివాదానికి దారితీస్తోంది. ఇటీవ‌ల జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్యట‌న‌కు వెళ్లారు. ఆయ‌న ప‌ర్యట‌న‌పై వైసీపీ నేత‌లు ఏమ‌నుకున్నారో తెలియ‌దు కానీ.. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అధికారి మాత్రం ప‌ర్యట‌న విజ‌య‌వంతం అవ్వాల‌ని స్థానికంగా ఉన్న ఓగుళ్లో ప్రత్యేక పూజ‌లు చేయించి.. మీడియా వారిని ఆహ్వానించి వార్తలు రాయించుకున్నారు. దీంతో ఇది స్థానికంగా చ‌ర్చనీయాంశం అయింది.

లక్ష్మణ రేఖ దాటుతున్నా……

ఇక‌, సీఎంవోలో ప‌నిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రతి ప‌థ‌కానికీ.. జ‌గ‌న్‌పేరునే సూచిస్తున్నారు. వీరి ప‌ని అదే అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. మ‌రికొంద‌రు రాళ్లపై జ‌గ‌న్‌పై చిత్రాలు చెక్కించేందుకు సిద్ధమ‌య్యారు. ఇలా అటు నాయ‌కులు, ఇటు అధికారులు కూడా ల‌క్ష్మణ రేఖ‌లు దాటేస్తుంటే ప్రభుత్వం మౌనంగా ఉండ‌డం త‌ప్ప ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఇది అంతిమంగా ప్రభుత్వానికి ప్రజ‌ల్లో చుల‌క‌న భావానికి కార‌ణ‌మ‌వుతోందంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News