జగన్ వ్యూహం అదుర్స్.. ఈ మాటన్నది ఎవరో తెలుసా..?
ఏపీలో కరోనా కట్టడి విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది. ఆయన వ్యూహంతో కరోనా కేసులు పెద్దగా నమోదు కావడం లేదా? ముందుగానే మేల్కొన్న [more]
ఏపీలో కరోనా కట్టడి విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది. ఆయన వ్యూహంతో కరోనా కేసులు పెద్దగా నమోదు కావడం లేదా? ముందుగానే మేల్కొన్న [more]
ఏపీలో కరోనా కట్టడి విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది. ఆయన వ్యూహంతో కరోనా కేసులు పెద్దగా నమోదు కావడం లేదా? ముందుగానే మేల్కొన్న రాష్ట్రంగా కూడా ఏపీ రికార్డు సృష్టించిందా? ప్రస్తుతం తీసుకున్న, భవిష్యత్తులో తీసుకోబోయే వ్యూహాలతో జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారా? అంటే జాతీయ మీడియా ఔననే అంటోంది. ప్రస్తుతం ఏపీలో కేసులు నాలుగు వందలు దాటాయి. మరణాలు ప్రస్తుతానికి ఏడుగా నమోదైనా.. దాని కట్టడి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న వైనాన్ని కూడా జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొంది.
ఏపీ రికార్డు సృష్టించిందంటూ….
వాలంటీర్లను ఇంటింటికీ పంపించడం సహా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అధికారులను నియమించడం, టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం ముదావహమని పేర్కొంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వడాన్ని కూడా ప్రముఖంగా పేర్కొనడం గమనార్హం. ఇక, తాజాగా తీసుకున్న రెండు మూడు ప్రధాన నిర్ణయాలను కూడా జాతీయ మీడియా ఎలుగెత్తి చాటింది. ప్రతి వ్యక్తికీ మూడు మాస్కుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని పేర్కొంది.
జాతీయ మీడియాలో…..
ఇక, టెలీ మెడిసిన్ ద్వారా సాధారణ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులను నిర్లక్ష్యం చేయకుండా కీలక చర్యలు తీసుకుంటున్న విధానాన్ని కూడా జాతీయ మీడియా ప్రముఖంగా పేర్కొంది. రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద ఇంటికి రూ.1000 పంపిణీతో పాటు పింఛన్ల పంపిణీని కూడా పూర్తి చేయడం ఏప్రిల్ నెలలో రెండు సార్లు రేషన్ ఇవ్వడం వంటి నిర్ణయాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ చేయలేదని తెలిపింది. అదే సమయంలో పోలీసులను కీలక పాత్ర పోషించేలా సహజ గుణానికి వ్యతిరేకంగా లాఠీలను పక్కన పెట్టి మరీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న తీరును జాతీయ మీడియా ప్రశంసలు గుప్పించింది.
పోలీసుల వ్యవహారం కూడా…..
ఆదిలో ఒకటి రెండు ఘటనలు మినహా తర్వాత పోలీసుల వ్యవహారం స్వాగతించదగిన రీతిలోనే ఉందని పేర్కొంది. ఇక కరోనా కట్టడిలో అనుసరిస్తున్న జోన్ల విధానాన్ని కూడా ప్రముఖంగా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి స్థానిక తెలుగు మీడియాలో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అంతగా పట్టించుకోక పోయినా.. జాతీయ మీడియా మాత్రం ఏపీలో ఏం జరుగుతోందో .. చెప్పడం విశేషంగానే చెప్పాలి. స్టార్టింగ్ జగన్ కరోనా వైరస్‌ను లైట్ తీస్కొన్నట్టు కనిపించినా తర్వాత వలంటీర్లను ఉపయోగించుకోవడం.. నలుగురైదుగురు మంత్రులను ఎలెర్ట్ చేయడంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లారు. అయితే అదే టైంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోలిస్తే పెద్దగా మీడియా ముందుకు రాలేదన్న అపవాదు కూడా ఆయన ఎదుర్కొన్నారు.