అక్కడ చాలా కాలం తర్వాత వైసీపీ నేత దొరికాడటగా?
ప్రకాశం జిల్లా అద్దంకి రాజకీయాల్లో తాజాగా ఓ చర్చ తెరమీదికి వచ్చింది. 2014 వరకు అద్దంకిలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్. తర్వాత [more]
ప్రకాశం జిల్లా అద్దంకి రాజకీయాల్లో తాజాగా ఓ చర్చ తెరమీదికి వచ్చింది. 2014 వరకు అద్దంకిలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్. తర్వాత [more]
ప్రకాశం జిల్లా అద్దంకి రాజకీయాల్లో తాజాగా ఓ చర్చ తెరమీదికి వచ్చింది. 2014 వరకు అద్దంకిలో వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్న గొట్టిపాటి రవి కుమార్. తర్వాత టీడీపీ అధినేత పిలుపుతో పార్టీ మారి టీడీపీ సైకిల్ ఎక్కారు. దీంతో అద్దంకిలో వైసీపీ బలమైన నాయకుడు లేకుండా పోయారనేది వాస్తవం. బాచిన చెంచు గరటయ్య ఉన్నప్పటికీ.. ఆయన వృద్ధుడు కావడంతో పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో నియొజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్న కరణం.. గొట్టిపాటి వర్గం ఉన్నప్పుడు వైసీపీ తరఫున గొట్టిపాటి విజయం సాధించారు. గత ఏడాది ఎన్నికల్లో గరటయ్యకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా బలమైన పోటీ ఇచ్చారు. దాదాపు 92 వేలపైచిలుకు ఓట్లు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం క్రియేట్ చేసినా కూడా ఇక్కడ గరటయ్య ఓటమిపాలయ్యారు.
ఇన్ ఛార్జిని మార్చినా….
పోనీ.. తర్వాత అయినా వైసీపీని నడిపించే నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే.. గరటయ్య తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఇక కొద్ది నెలల క్రితమే జగన్ అద్దంకి ఇన్‌చార్జ్‌గా ఉన్న గరటయ్యను తప్పించి ఆయన స్థానంలో ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యను నియమించారు. అయినా అద్దంకి నాయకత్వంపై జగన్‌కు, వైసీపీ నాయకులను ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. అక్కడ వరుసగా నాలుగుసార్లు గెలుస్తూ వస్తోన్న గొట్టిపాటి రవిని ఓడించేందుకు మరింత బలమైన నాయకత్వం కోసం అన్వేషణ చేస్తున్నారు. దీంతో గొట్టిపాటిని తిరిగి పార్టీలోకి ఆహ్వా నించాలని ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. ఆయన భీష్మించారు. దీంతో ఇక్కడ ఇప్పటికిప్పుడు వైసీపీకి నాయకుడు అవసరం అయ్యారు.
వెంకటేష్ ను రంగంలోకి దించి….
ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్.. వెనువెంటనే టీడీపీలో నుంచి వైసీపీ వైపు చూస్తున్న చీరాల ఎమ్మె ల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్‌ను పార్టీలోకి తీసుకున్నారు. వెంకటేష్ యువకుడు కావడం, గతంలోనూ ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవిపై విజయం సాధించారు. రాష్ట్రంలో వైసీపీ ఓడిన 23 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తోన్న జగన్ ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఈ నేపథ్యంలో అద్దంకిలో ఇప్పటి నుంచి వెంకటేష్‌ను రంగంలోకి దింపడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధినేత భావిస్తున్నారు.
గొట్టిపాటికి చెక్ పెట్టగలరా?
ఇక, కరణం వెంకటేష్ పరిస్థితిని గమనిస్తే.. ఆయన రాజకీయాల్లో మంచి ఉత్సాహంగా పనిచేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నా రు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయినా.. దాదాపు 95 వేల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఓడిపోయినా..కూడా ప్రజల మధ్యే ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో వెంకటేష్ అద్దంకి టికెట్ ఆశించినా.. కూడా గొట్టిపాటి పార్టీలోకి రావడంతో చంద్రబాబు ఆయనను తిరస్కరించారు. అయితే చివర్లో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడడంతో కరణం బలరాంకు చీరాల సీటు ఇవ్వగా ఆయన విజయం సాధించారు. ఇక భవిష్యత్తు రాజకీయ అవసరాల నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్‌ను పార్టీలో చేర్చుకోవడంతో అద్దంకి వైసీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం చీరాల వైసీపీలో ఇటు కరణం.. అటు ఆమంచి వర్గాల మధ్య వార్ నడుస్తోంది. రేపటి వేళ కరణం తనయుడు వెంకటేష్‌కు అద్దంకి సీటు ఇస్తారన్న అనుమానాల నేపథ్యంలో ఇటు బాచిన కృష్ణ చైతన్యకు సైతం ఇప్పుడు టెన్షన్ పట్టుకుందట.