బ్రేకింగ్ : నిమ్మగడ్డపై నిప్పులు చెరిగిన జగన్

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఎన్నికల కమిషనర్ విచక్షణను కోల్పోయారన్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించారన్నారు. [more]

Update: 2020-03-15 09:53 GMT

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఎన్నికల కమిషనర్ విచక్షణను కోల్పోయారన్నారు. చంద్రబాబు హయాంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించారన్నారు. పదినెలల తర్వాత జగన్ తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్నారు. కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నామని చెప్పి, మరోవైపు గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందన్నారు. విచక్షణ కోల్పోయి ఎన్నికల కమిషనర్ వ్యవహరించారన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికై ఇక ప్రభుత్వాన్ని నడుపుతుంది ఎందుకు అని జగన్ ప్రశ్నించారు. ఆయనకు ఇలా వ్యవహరించే అధికారం ఆయనకు ఎక్కడిదని నిలదీశారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కూడా నిలిపి వేయాలని ఎన్నికల కమిషర్ ఆదేశించారన్నారు. వైసీపీ ఏకగ్రీవం కావడమే వాయిదాకు కారణమన్నారు.

ఎవరినీ అడగకుండానే……

దీనిని తట్టుకోలేెక, జీర్ణించుకోలేక చంద్రబాబు మరింత దిగజారిపోతారని భావించే ఎన్నికల వాయిదా వేసినట్లుందన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఆర్డర్ ఎన్నికల కార్యదర్శికే తెలియదని జగన్ అన్నారు. ఎవరో వెనకుండి ఎన్నికల కమిషనర్ నడిపిస్తున్నారన్నారు. కరోనా వైరస్ సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేస్తున్నప్పుడు అసలు పరిస్థితిని హెల్త్ సెక్రటరీని అడిగారా? అని ఆయన ప్రశ్నించారు. వైద్య ఆరోగ్య శాఖను కూడా సంప్రదించలేదన్నారు. చీఫ్ సెక్రటరీ తో కూడా చర్చించలేదన్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…..

కరోనాపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఏపీలో 70 నమూనాలు తీసుకుంటే అందులో ఒకటి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. బీపీ, షుగర్, గుండె, లివర్ వంటి సమస్యలున్న వారికే ఈ వైరస్ ఎక్కువగా సోకుందని జగన్ తెలిపారు. చైనాలో మొదలై కరోనా వైరస్ అన్ని దేశాలకు విస్తరిస్తుందని చెప్పారు. కేవలం రెండు, మూడు వారాల్లో పరిస్థితిలో మార్పు రాదని జగన్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన కేసులు కూడా 80 శాతంం ఇంట్లోనే నయమవుతున్నాయని జగన్ తెలిపారు. ఇంతదానికి ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం ఏముందని జగన్ ప్రశ్నించారు.

వ్యవస్థలను దిగజారుస్తూ…..

ఏపీ ప్రజలు చింతాల్సివస్తుందన్నారు. ఇంత దారుణంగా వ్యవస్థలను దిగజార్చడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమవుతుందన్నారు. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయలన్నారు. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని జగన్ సూచించారు. కరోనా వైరస్ బాధితులందరూ విదేశాల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. విజయవాడలో యాభై పడకల వార్డు రెడీగా ఉందన్నారు. గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నామని చెప్పారు. ఐసోలేషన్ రూములను కూడా ఏర్పాటు చేశామని చెపపారు. ఏ ఒక్కరూ ఈ వ్యాధి బారిన పడకూడదనే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News