నాలుగేళ్ల వ్యూహాన్ని ముందే సిద్ధం చేసుకున్నట్లుందే

తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ విష‌యం నిజ‌మ‌నేన‌ని అనిపిస్తోంది. సుదీర్ఘ పాద‌యాత్ర అనంత‌రం జ‌గ‌న్ ఏపీలో ప్రజ‌ల‌ను మెప్పించి, భారీ మెజారిటీ సాధించి త‌న ప్రభుత్వాన్ని ఏర్పాటు [more]

Update: 2020-03-04 02:00 GMT

తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ విష‌యం నిజ‌మ‌నేన‌ని అనిపిస్తోంది. సుదీర్ఘ పాద‌యాత్ర అనంత‌రం జ‌గ‌న్ ఏపీలో ప్రజ‌ల‌ను మెప్పించి, భారీ మెజారిటీ సాధించి త‌న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వ‌చ్చీ రావ‌డంతోనే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణయాలు ప్రక‌టించి అంద‌రినీ అబ్బుర‌ప‌రిచారు. గ్రామ స్వరూపాన్ని స‌మూలంగా మార్చి వేయ‌గ‌ల గ్రామ స‌చివాలయాల నుంచి మ‌హిళా భ‌ద్రత వ‌ర‌కు, అవినీతి ర‌హిత పాల‌న నుంచి అంద‌రికీ అన్నీ అందాల‌నే కృత నిశ్చయం వ‌ర‌కు కూడా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో దూసుకు పోతున్నారు. వీటికితోడు నాడు-నేడు పేరుతో విద్యార్థుల భ‌విత‌, ప్రభుత్వ స్కూళ్ల భ‌విత మారేలా ముందుకు సాగుతున్నారు.

మెరుపులు లేకపోయినా…..

జ‌గ‌న్ 9 నెల‌ల పాల‌న‌లో పెద్దగా మెరుపులు లేక‌పోయినా ప్రజ‌ల్లో మాత్రం సానుకూల వాతావ‌ర‌ణం నెల‌కొంది. జ‌గ‌న్ ఇంకా ఇప్పటి వ‌ర‌కు బాగానే చేస్తున్నట్టు ఉంది. ఇంకా ఏం చేస్తాడో ? చూద్దాం ? అనే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుతోనే ఇలాంటి సంచ‌లన నిర్ణయాలు తీసుకున్న సీఎం జ‌గ‌న్.. దీనికి సంబంధించి ఇంత త‌క్కువ కాలంలో ఇంత సంచ‌ల‌నాల దిశ‌గా ఎలా వెళ్లార‌నే ఆలోచ‌న అందిరినీ విస్మయానికి గురి చేసింది. అయితే, ఇప్పుడు మ‌రింత ఆశ్చర్యపోయే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వ‌చ్చే నాలుగేళ్లలో ఏపీకి ఏం చేయాలి? ఎలాంటి పెట్టుబ‌డులు సాధించాలి? ప్రజ‌ల జీవన ప్రమాణాల‌ను ఎలా పెంచాలి? వ‌ంటి కీల‌క విషయాల‌పై జ‌గ‌న్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది.

ఇవి గ్రౌండ్ చేయాలని….

వచ్చే మూడేళ్లలో భూముల రిజిస్ట్రేషన్‌ కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక నర్సు, ఒక ఏఎన్‌ఎంతో నిత్యం వైద్యం అందించేలా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయ‌నున్నారు. ఇప్పుడున్న 11 బోధనాసుపత్రులను 27కు పెంచనున్నారు. విద్యా వ్యవస్థలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరిగేందుకు పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మఒడి, విద్యా వసతి పథకాలు అమలు చేయ‌నున్నారు.

పక్కా ప్లానింగ్ తోనే…

ఈ చర్యల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయాలు పెరుగుతాయ‌న‌డంలో సందేహం లేదు. తద్వారా వలసలు తగ్గి నగరాలు, పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుందనేది జ‌గ‌న్ అంచ‌నా. అదేస‌మ‌యంలో రాష్ట్ర మౌలిక స్వరూపం కూడా మారిపోనుంది. జిల్లాల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వంటివి కూడా అమ‌లులోకి రానున్నాయి. ఇదీ మొత్తంగా రాబోయే నాలుగేళ్లలో జ‌గ‌న్ ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నట్టే క‌నిపిస్తోంది.

Tags:    

Similar News