పాపులరిటీకి పెద్ద చిక్కొచ్చి పడిందే?
జగన్ కు ఒక ఇమేజ్ ఉంది. ఎంతగా అంటే అప్పట్లో దేశాన్ని శాసిస్తున్న సోనియా గాంధీనే ఎదిరించారని. జగన్ కు భయమనేది తెలియదంటారు. తాను అనుకున్న లక్ష్యాన్ని [more]
జగన్ కు ఒక ఇమేజ్ ఉంది. ఎంతగా అంటే అప్పట్లో దేశాన్ని శాసిస్తున్న సోనియా గాంధీనే ఎదిరించారని. జగన్ కు భయమనేది తెలియదంటారు. తాను అనుకున్న లక్ష్యాన్ని [more]
జగన్ కు ఒక ఇమేజ్ ఉంది. ఎంతగా అంటే అప్పట్లో దేశాన్ని శాసిస్తున్న సోనియా గాంధీనే ఎదిరించారని. జగన్ కు భయమనేది తెలియదంటారు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి జగన్ ఏ పరీక్షనైనా ఎదుర్కొంటారంటారు. పదహారు నెలల జైలు జీవితం కూడా గడిపి వచ్చిన జగన్ కసి మీద ముఖ్యమంత్రి అయ్యారు. ఇదీ ఆయనకు ప్రజల్లో ఉన్న పాపులారిటీ. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ లో భిన్న ధోరణులు కన్పిస్తున్నాయి.
మోదీకి వ్యతిరేకంగా..?
ప్రధానంగా మోదీ కి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధపడటం లేదు. దాదాపు రెండేళ్ల నుంచి ఇదే జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ జగన్ పెదవి విప్పడం లేదు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి సున్నితమైన అంశంలో కూడా ప్రధాని మోదీతో జగన్ కయ్యానికి సిద్ధపడటం లేదు. పైగా జగన్ మోదీని వెనకేసుకుని రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
డేరింగ్ అండ్ డేషింగ్….
జగన్ ను డేరింగ్ అండ్ డేషింగ్ గా ఊహించుకున్న ఆ పార్టీ క్యాడర్ కు, ప్రజలకు ఈ రెండేళ్ల కాలంలో ఆ భ్రమలు తొలగిపోయాయంటున్నారు. జగన్ కు కూడా లొంగిపోయే మనస్తత్వం ఉందని ఆయన గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దాని సహకారం కష్టాల్లో ఉన్న ఏపికి అవసరమే. దానిని ఎవరూ కాదనలేరు. కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసైనా అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉండేదని జగన్ పార్టీ నేతలే అభిప్రాయ పడు తున్నారు.
స్టీల్ ప్లాంట్ సమస్యను….
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను జగన్ లైట్ గా తీసుకుంటున్నట్లుంది. నిజంగా దాని ప్రయివేటీకరణ జరిగితే ఆ ప్రభావం జగన్ పైన, ఆ పార్టీపైనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీకి ఇబ్బందులు ఎదురుకాక తప్పదు. సున్నితమైన అంశాల్లో కూడా జగన్ నుంచి రియాక్షన్ లేకపోవడాన్ని అనేక మంది తప్పుపడుతున్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాతైనా జగన్ లో మార్పు రాకపోవడం మంచిది కాదని సొంత పార్టీ నేతలే అంటున్నారు.