పులివెందుల పులి పరువు పోయిందా?
వైఎస్సార్ మరణించి పుష్కర కాలం గడచినా ఆయన జనాల హృదయాల్లోనే ఉన్నారు. అదే విధంగా ఆయన పేరిట పార్టీని పెట్టి ప్రత్యర్ధులకు తొడ కొట్టి అధికారం పట్టిన [more]
వైఎస్సార్ మరణించి పుష్కర కాలం గడచినా ఆయన జనాల హృదయాల్లోనే ఉన్నారు. అదే విధంగా ఆయన పేరిట పార్టీని పెట్టి ప్రత్యర్ధులకు తొడ కొట్టి అధికారం పట్టిన [more]
వైఎస్సార్ మరణించి పుష్కర కాలం గడచినా ఆయన జనాల హృదయాల్లోనే ఉన్నారు. అదే విధంగా ఆయన పేరిట పార్టీని పెట్టి ప్రత్యర్ధులకు తొడ కొట్టి అధికారం పట్టిన జగన్ తండ్రి ఖ్యాతినీ విఖ్యాతిని పదింతలు చేశారు. ఇప్పటిదాకా ఎవరినా వైఎస్సార్ ని విమర్శించలేకుండా ఉన్నారు అంటే ఆయన మరణించి కూడా జనం గుండెల్లో బతికి ఉండడమే కారణం. అదే విధంగా ఆయన తనయుడు అప్రతిహత విజయాలతో వైఎస్సార్ గర్వాన్ని ఇనుమడింపచేశారు అన్నది కూడా నిజం.
మడమ తిప్పేశారా…?
వైఎస్సార్ అంటే మడమ తిప్పని నైజానికి నిలువెత్తు ప్రతీక. ఆయన అలా ఉండబట్టే పీసీసీ చీఫ్ అయిన పాతికేళ్ల వరకూ సీఎం సీట్లోకి రాలేకపోయారు. రాజీపడని వైఎస్సార్ వైఖరి ఆయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎన్నోసార్లు దూరం చేసింది. మొత్తానికి తాను కష్టపడి జన హృదాధినేతగా నిలిచి ఆ పదవిని సాధించుకున్నారు. మరి ఆయన తనయుడుగా జగన్ కూడా కొండలాంటి సోనియాగాంధీని ఎదిరించారు. ఫలితంగా జైలు జీవితం ప్రాప్తించినా ఎక్కడా ఆయన తగ్గలేదు. అలాంటి జగన్ ఇపుడు ఒక్కసారిగా మడమ తిపేశారా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది.
నిస్సహాయుడా..?
జగన్ నిస్సహాయుడని ఏ చంద్రబాబో అనలేదు. పొరుగున ఉన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. ఆయన మోడీ మీద అసహనం వ్యక్తం చేస్తే జగన్ హిత వచనాలు పలికినందులు ఇలా గట్టి రిటార్ట్ ఇచ్చారు. జగన్ నిస్సహాయతను దేశం మొత్తం అర్ధం చేసుకుంది అంటూ ఇండైరెక్ట్ గా ఆయన మీద ఉన్న సీబీఐ కేసులను కెలికారు. అదే విధంగా మోడీ ప్రాపకం కోసం జగన్ పరితపిస్తున్నారు అని కూడా ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఒడిషాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా అయిత వైఎస్సార్ ప్రస్థావన కూడా చేసి ఆ తండ్రి బిడ్డగా జగన్ ఇంకా ఎదగాలి కానీ మోడీ కి వంత పాడడమేంటని కౌంటరేశారు.
ఎందుకిలా…?
వీటికి ముందు తమిళనాడు ఎన్నికల వేళ డీఎంకే అధినేత స్టాలిన్ కూడా జగన్ మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. వారికి కేసులు ఉండి మోడీకి లొంగుతారని, తాను అలాంటి వాడిని కాను అంటూ గట్టిగానే మాట్లాడారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ ఎందుకిలా అన్న చర్చ అయితే వైసీపీలోనే వస్తోంది. పులిలాంటి పులివెందుల బిడ్డ మోడీకి తలొగ్గరు అని నిన్నటిదాకా అంతా అనుకున్నారు. కానీ సోరెన్ ఎపిసోడ్ లో జగన్ బాహాటంగా మోడీకి మద్దతు ఇవ్వడంతో స్వపక్షం సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది అంటున్నారు. జగన్ బెయిల్ రద్దు విషయం ఇపుడు రాజకీయంగా వేడి పుట్టిస్తున్న నేపధ్యంలో జగన్ మోడీని వెనకేసుకురావడం పైన ఎవరికి వారు తోచిన భాష్యాన్ని చెప్పుకుంటున్నారు.