తగ్గంది…అందుకేనట…!!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న దూకుడును ఏ మాత్రం త‌గ్గించ‌లేదు. పైగా మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ స‌హా అమ‌రావ‌తి [more]

Update: 2019-09-01 02:00 GMT

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న దూకుడును ఏ మాత్రం త‌గ్గించ‌లేదు. పైగా మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ స‌హా అమ‌రావ‌తి విష‌యంలో పెద్ద ఎత్తున విప‌క్షాలు ఆందోళ‌న‌కు సిద్ధమైన‌ప్పటికీ.. ఆయ‌న లెక్కచేయ‌డం లేదు. జ‌గ‌న్ వ్యతిరేక మీడియా పుంఖాను పుంఖాలుగా క‌థ‌నాలు రాస్తున్నా.. ఆయ‌న ఏమాత్రం వెర‌వ‌డం లేదు. అంతెందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయ‌కులు కూడా వ్యతిరేకిస్తున్నా.. ఆయ‌న ముందుకు వెళ్తున్నారు.

ఒత్తిళ్లు పెరిగినా….

మ‌రి దీనికి కార‌ణం ఏంటి? అస‌లు జ‌గ‌న్ ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నందుకు కార‌ణాలేంది? ఇప్పుడు ఇవే విష‌యాల‌పై మేధావులు దృష్టి పెట్టారు. విష‌యంలోకి వెళ్తే.. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన వైఎస్ జ‌గ‌న్‌ను నిలువ‌రించేందుకు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరిగిన మాట వాస్తవం. ఆఖ‌రిని త‌న సొంత పార్టీలోనూ ఇమేజ్ సాధించ‌లేని పురందేశ్వరి వంటి వారు కూడా జ‌గ‌న్‌పై విమ‌ర్శలు చేస్తున్నారు. ఇక‌, ప‌వ‌న్ కూడా రాజ‌ధాని గ్రామాల్లో ప‌ర్యటించి కీల‌క వ్యాఖ్యలే చేశారు. అయినా కూడా జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గలేదు.

కేంద్రం పెద్దల అండతోనే…..

ఈ మొత్తం విష‌యం వెనుక వైఎస్ జ‌గ‌న్ దూకుడుగా ముందుకు వెళ్లడానికి రీజ‌న్ ఏంట‌నేది చాలా ఆలోచింప చేస్తున్న విష‌యం. ప్రధానంగా కేంద్రంలోని కొంద‌రు పెద్దలు ఆయ‌న‌కు స‌హ‌క‌రిస్తున్నార‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. మా వాళ్ల విమ‌ర్శల‌ను మీరు ప‌ట్టించుకోవ‌ద్దు. ప్రజ‌లు మీకు అధికారం ఇచ్చారు. మీరు ప్రజ‌ల‌కు ఇష్టమైన మార్గంలో న‌డ‌వండి! అని నేరుగా అమిత్ షా వంటివారి నుంచే అభ‌యం ల‌భించింద‌ని వారు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా కీల‌క వ్యాఖ్యలు చేశారు. తాము ఏం చేసినా కేంద్రానికి చెప్పే చేస్తున్నా మని అన్నారు.

అందుకే ఈ దూకుడు….

ఈ వ్యాఖ్యల‌ను అంత తేలిక‌గా కొట్టి పారేసేందుకు అవ‌కాశం లేదు. పైగా కేంద్రంపై లేనిది ఉన్నట్టు చెబితే.. జ‌రిగే ప‌ర్యవ‌సానాలు తెలియ‌వ‌ని అనుకోలేం. సో.. మొత్తానికి కేంద్రంలోని పెద్దల నుంచి జ‌గ‌న్‌కు పుష్కల‌మైన అభ‌యం ల‌భించ‌బ‌ట్టే ఇలా దూకుడు ప్రద‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే ఇటీవ‌ల కాలంలో కేంద్రం నుంచి వ‌స్తున్న పెద్దలు జ‌గ‌న్‌కు వ్యతిరేకంగా వినిపించే త‌మ బాణిని త‌గ్గించుకున్నారు. మొత్తానికి కేంద్రంలో జ‌గ‌న్ స‌త్తా నిరూపించుకున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News