జగన్ కు వారంతా దూరమవుతున్నారా?
ఏపీలో అగ్ర వర్ణాలు ఇపుడు ఉద్యమ జెండా ఎత్తుతున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన వాటిని సాధించుకునేందుకు వారు రెడీ అవుతున్నారు. కేంద్రం ఉదారంగా 2019 ఎన్నికలకు ముందు [more]
ఏపీలో అగ్ర వర్ణాలు ఇపుడు ఉద్యమ జెండా ఎత్తుతున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన వాటిని సాధించుకునేందుకు వారు రెడీ అవుతున్నారు. కేంద్రం ఉదారంగా 2019 ఎన్నికలకు ముందు [more]
ఏపీలో అగ్ర వర్ణాలు ఇపుడు ఉద్యమ జెండా ఎత్తుతున్నారు. తమకు న్యాయంగా రావాల్సిన వాటిని సాధించుకునేందుకు వారు రెడీ అవుతున్నారు. కేంద్రం ఉదారంగా 2019 ఎన్నికలకు ముందు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లను ఏపీలో అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్య ఉపాధి రంగాల్లో తమకు ఆ రిజర్వేషన్ల పుణ్యమాని అవకాశాలు పెరుగుతాయని వారు అంటున్నారు. ఏపీలో దాన్ని అమలు చేసి రిజర్వేషన్ల ఫలాలను అందించడానికి జగన్ కి ఉన్న అభ్యంతరం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు.
కేసీయార్ ని చూసి ..
పొరుగున ఉన్న కేసీయార్ ఈ మధ్యనే పది శాతం రిజర్వేషన్లను అగ్ర కులాలకు ఇచ్చారు. దాంతో ఏపీలో కూడా మెల్లగా ఉద్యమం దిశగా అగ్ర కులస్థులు కదులుతున్నారు. ఈ మధ్యనే ఏపీవ్యాప్తంగా ఉన్న అగ్ర కులాల పెద్దలంతా సమావేశమై జేఏసీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి, వెలమ సహా ఇతర అగ్ర కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమకు ఏపీలో కచ్చితంగా పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే కార్పొరేషన్లు లేని అగ్రకులాలకు వాటిని తక్షణం ఏర్పాటు చేయాలని కూడా జగన్ ను డిమాండ్ చేస్తున్నారు.
బీసీల హెచ్చరిక….
మరో వైపు చూస్తే అగ్ర వర్ణాలకు పది శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను బీసీలు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. ఏపీ బీసీ సంఘం ప్రెసిడెంట్ కేసన శంకరరావు అయితే ఇది తమకు అసలు సమ్మతం కాదని తెగేసి చెబుతున్నారు. ఇక ఏపీలో బీసీలని ఇపుడిపుడే తన వైపునకు తిప్పుకుంటున్న జగన్ కి ఓసీల డిమాండ్ నిజంగా ఒక పెను సవాల్ గా మారుతుంది అంటున్నారు. అసెంబ్లీని సమావేశపరచి క్షణాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయవచ్చు. కానీ అదంత సులువు కాదు, రాజకీయ సామాజిక సమీకరణలు వైసీపీకి ఇబ్బందిగా మారుతాయనే జగన్ ఆలోచిస్తున్నారు అంటున్నారు.
కానివారు అవుతున్నారా….?
తమ సొంత సామాజికవర్గం నుంచి జగన్ సీఎం అయ్యాడని రెడ్డి కులస్థులు మొదట్లో సంతోషించారు. అయితే ఇపుడు వారిలో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగడంలేదని అంటున్నారు. అగ్ర కులాల రిజర్వేషన్లను కూడా జగన్ అడ్డుకోవడం మంచిది కాదని రెడ్డి సామాజికవర్గం గుస్సా అవుతోంది. ఇక కమ్మలు సరేసరి, బ్రాహ్మణులు ఇతర అగ్ర కులాల వారు కూడా వైసీపీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఉంది. మరి ఇపుడు కులాల మధ్య పోరాటం రేగితే జగన్ కి అతి పెద్ద ఇరకాటమే అవుతుంది అంటున్నారు. ఈ కారణంతో బీసీలంతా మళ్లీ వైసీపీకి దూరం అయితే జగన్ కి రాజకీయంగా అది తీరని నష్టమని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. మొత్తానికి ఓసీల ఉద్యమం చేస్తే మాత్రం ఏపీలో కులాల మధ్య సంకుల సమరానికి దారితీయవచ్చు అంటున్నారు. చూడాలి మరి దీనికి పరిష్కారాన్ని జగన్ ఏం సూచిస్తారో.