అమరావతి మొక్కులు తీర్చేస్తారా…?
జగన్ కి మొక్కులు తీర్చడం లెక్కలు సరి చేయడం బాగా అలవాటే. ఆయన మడమ తిప్పరు, మాట తప్పరు. అందుకే తొలి ఏడాదిలోనే ఎన్నికలలో ఇచ్చిన అనేక [more]
జగన్ కి మొక్కులు తీర్చడం లెక్కలు సరి చేయడం బాగా అలవాటే. ఆయన మడమ తిప్పరు, మాట తప్పరు. అందుకే తొలి ఏడాదిలోనే ఎన్నికలలో ఇచ్చిన అనేక [more]
జగన్ కి మొక్కులు తీర్చడం లెక్కలు సరి చేయడం బాగా అలవాటే. ఆయన మడమ తిప్పరు, మాట తప్పరు. అందుకే తొలి ఏడాదిలోనే ఎన్నికలలో ఇచ్చిన అనేక హామీలను కూడా నెరవేర్చేసి మొనగాడు అనిపించుకున్నారు. ఇపుడు మూడు రాజధానులు అంటూ భారీ టార్గెట్ నే ముందు పెట్టుకున్న జగన్ ఆ ముహూర్తం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన అనుకున్నట్లుగా ఇపుడు టైం కూడా కలసివస్తోంది అంటున్నారు.
శాసన రాజధానిగా….?
అమరావతిని తాను శాసనరాజధానిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అక్కడే ఎమ్మెల్యేలు ఉంటారు. ఎమ్మెల్సీలు ఉంటారు. సివిల్ సర్వీస్ అధికారుల క్వార్టర్లు కూడా ఉంటాయి. అయితే వాటికి సంబంధించిన భవనాలు మాత్రం ఇప్పటికైతే పూర్తి కాలేదు. ఈ మధ్య జగన్ ఉన్నట్లుండి అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతిలోని నిర్మాణాలు ఎంతదాకా వచ్చాయని ఆరా తీశారు. డెబ్బై శాతం పూర్తి అయిన వాటిని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాటికి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందిట. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాగోలా తెచ్చి ఇచ్చేగలదు. దాంతో వాటికి ఏ బెంగ కూడా అవసరంలేదు.
వేగంగా పూర్తి …..
ఇక మిగిలిన వాటిని పూర్తి చేయాలంటేనే కచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయల పై చిలుకు మొత్తం అవసరం పడుతుంది. దాని కోసమే ఇపుడు బ్యాంక్ రుణాలకు వెతుకుతున్నారు. ఆ మొత్తాన్ని తెచ్చి టైం బౌండ్ ప్రొగ్రామ్ గా పెట్టుకుని ఏదో విధంగా అమరావతి నిర్మాణాలను పూర్తి చేస్తే జగన్ కాళ్ళకు వేసుకున్న అమరావతి సంకెళ్ళు వీడిపోతాయని అంటున్నారు. తాను చెప్పినట్లుగా అమరావతిని శాసన రాజధానిని చేశాను అని జగన్ చెప్పుకోవడానికి వీలు ఉంటుంది అంటున్నారు. అపుడు జగన్ ఏ విశాఖకు వెళ్ళినా అడిగే వారు ఉండరు అని అంచనా వేస్తున్నారు.
అదే కచ్చితమా….?
విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ తో సహా ముఖ్యమైన భవనాలకు ఎంపిక ఇప్పటికే పూర్తి అయిందని అంటున్నారు. ఏప్రిల్ 13న ఉగాది మంచి ముహూర్తమని కూడా జగన్ తలపోస్తున్నారు. ఎందుకోసం తోసుకువచ్చిందో తెలియదు కానీ అనుకున్న దాని కంటే ముందే స్థానిక ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి. మార్చి 31 తో లోకల్ బాడీస్ ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కూడా పూర్తి అయిపోతే మరో మూడేళ్ళ వరకూ జగన్ కి ఏ ఎన్నికల బెడదా ఉండదు అంటున్నారు. అందువల్ల కాస్తా లేట్ అయినా విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి తాను అనుకున్నట్లుగా ఏపీలో మూడు రాజధానులను ప్రజలకు అందించాలన్నది జగన్ అజెండాగా ఉందిట. మొత్తానికి జగన్ రూట్ క్లియర్ చేసుకుంటున్నారన్నమాట.