డిఫెన్స్ ఆడుతున్న జగన్…?
ఏపీలో అధికారంలో ఉన్నది జగన్. ఈ సంగతి వైసీపీ మరచిపోతోంది. అన్నింటికీ మించి జగన్ కూడా విస్మరిస్తున్నారులా ఉంది. చేతిలో పవర్ ఉంది సరే దాన్ని వినియోగిస్తే [more]
ఏపీలో అధికారంలో ఉన్నది జగన్. ఈ సంగతి వైసీపీ మరచిపోతోంది. అన్నింటికీ మించి జగన్ కూడా విస్మరిస్తున్నారులా ఉంది. చేతిలో పవర్ ఉంది సరే దాన్ని వినియోగిస్తే [more]
ఏపీలో అధికారంలో ఉన్నది జగన్. ఈ సంగతి వైసీపీ మరచిపోతోంది. అన్నింటికీ మించి జగన్ కూడా విస్మరిస్తున్నారులా ఉంది. చేతిలో పవర్ ఉంది సరే దాన్ని వినియోగిస్తే ఆ మీదట వచ్చే పర్యవసానాలు, ఫలితాలు గురించి కూడా జగన్ ఆలోచన చేసుకోవాల్సి ఉంది. ప్రతీ దానికీ అరెస్టులనే ఆయుధంగా చేసుకోవడం ద్వారా ఏపీలో విపక్షాన్ని తగ్గించాలని వైసీపీ భావిస్తోంది. కానీ ఆ తగ్గింపు అంతకంటే కొన్ని రెట్లు హెచ్చింపు అని మరచిపోతోంది. వరసగా ఒకే వ్యక్తి మీద కత్తి కట్టినట్లుగా అరెస్టులు చేస్తే జనం ఎలా అనుకుంటారు అన్నది కూడా ఇక్కడ అతి ముఖ్యం.
అందుకే అలా….
ఏపీలో అచ్చెన్నాయుడుని కేవలం ఎనిమిది నెలల తేడాలో రెండు సార్లు వైసీపీ సర్కార్ అరెస్ట్ చేసింది. అంతే కాదు, ఈ మధ్యనే సంతబొమ్మాళి నంది విగ్రహం కేసులో కూడా అచ్చెన్నాయుడుకి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. ఇపుడు ఒక్కసారిగా అచ్చెన్నాయుడు హీరో అయిపోయాడు. ఆయన తొలిసారి అరెస్ట్ అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని చంద్రబాబు ఇచ్చారు. ఇపుడు మరోసారి అరెస్ట్ అయితే ఆయనే ఏకంగా తనకు తానుగానే హోం మంత్రి పదవి ఇచ్చేసుకున్నాడు. అంటే ప్రతీ అరెస్టు తో అచ్చెన్న ఎదుగుతున్నాడనేగా అర్ధం.
తమ్ముళ్ళలో కసి…
ఇక తెలుగుదేశం తమ్ముళ్ళు చంద్రబాబు మాటలను సైతం పట్టించుకోకుండా పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టారు. ఎపుడైతే వైసీపీ సర్కార్ ఏకగ్రీవాలు అంటూ ప్రకటనలు చేసిందో దాంతో తమ్ముళ్లలో పట్టుదల పెరిగింది. దానికి తోడు అన్నట్లుగా అధికార పార్టీ నేతలు బరితెగించి చాలా చోట్ల చేసిన వీరంగానికి కూడా విసుగెత్తి మరీ వీధుల్లోకి వచ్చేశారు. ఇపుడు వారంతా పోటీకి సై అన్నారు. దాంతో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా లక్ష దాకా నామినేషన్లు రావడం అంటే అది రాజకీయ చైతన్యంగానే చూడాలి కదా?
ట్రాప్ లో పడ్డారా…?
ఏపీలో రచ్చ జరగాలి. గొడవలు రేగాలి. ఇది టీడీపీ వ్యూహం. దాంతోనే వారు చాలా చోట్ల రెచ్చగొడుతున్నారు. దానికి తెలిసో తెలియకో వైసీపీ నేతలు అట్రాక్ట్ అవుతున్నారు. ఆ మీదట జరిగిన వివాదాలకు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరెస్టుల పర్వానికి తెర తీస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ కోరుకున్నదే అది. ఇలా గొడవలు ఏం జరిగినా కధ కంచికి చేరాలి. తమ వారు అరెస్ట్ అయితే జనంలో సానుభూతి వస్తుంది, ఈ సర్కార్ మీద అంతకంతకు వ్యతిరేకత పెరుగుతుంది అన్నది టీడీపీ పెద్దల స్ట్రాటజీ. మరి దాన్ని అచ్చంగా కోరుకున్నట్లుగానే అమలు చేస్తున్నారు జగన్. ఒక విధంగా పంచాయతీ ఎన్నికల విషయంలో మొదటి నుంచి వైసీపీ డిఫెన్స్ ఆడుతోంది. ఎన్నికలు వద్దు అనడం, ఏకగ్రీవాలు ముద్దు అనడం, వైసీపీ నేతలను అరెస్ట్ చేయడం, దాడులు చేయడం ఇవన్నీ జనాలకు చెప్పే సంకేతాలు ఏంటి అంటే వైసీపీకి జన బలం లేదన్నదే. నిజంగా పరిస్థితి అలా ఉందా. కేవలం 20 నెలల వ్యవధిలో ఇలా జరుగుతుందా? కానేకాదని పార్టీ పెద్దలకు తెలుసు. అయినా సరైన వ్యూహాలు లేక దూకుడుతోనే వైసీపీ ఇలా చేస్తోందని సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట.