ఈ ముగ్గురితోనే కథంతా నడుస్తుందా?

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్మ సామాజికవర్గాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇది నిజమేననిపించక మానదు. ఒక వర్గం మీడియా [more]

Update: 2021-01-28 12:30 GMT

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కమ్మ సామాజికవర్గాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటున్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇది నిజమేననిపించక మానదు. ఒక వర్గం మీడియా కూడా పదే పదే ఒక సామాజికవర్గంపై జగన్ కక్ష కట్టారన్న ప్రచారం చేస్తుంది. అమరావతి రాజధాని అంశం నుంచి ఈ ప్రచారం ప్రారంభమయింది. విశాఖలో గీతం యూనివర్సిటీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, వెలగపూడి రామకృష్ణ భూములను కూడా తిరిగి ప్రభుత్వం తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

వీరితోనే కథంతా…..

అయితే వైసీపీలోని కమ్మ సామాజకవర్గానికి చెందిన ఈ ముగ్గురు నేతలు మాత్రం టీడీపీకి మింగుడపడటం లేదు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో అనేక మంది కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచారు. కొందరు టీడీపీ లో గెలిచి వైసీపీకి మద్దతుదారుగా నిలిచారు. ఈ ముగ్గురు నేతలతో టీడీపీని వైసీపీ ఒక ఆటాడుకుందన్న టాక్ నడుస్తుంది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వసంత కృష్ణ ప్రసాద్ లు దూకుడుగా వ్యవహరిస్తుండటం టీడీపీకి మింగుడపడటం లేదు.

కొడాలి నాని సంగతి….

మంత్రి కొడాలి నాని తొలి నుంచి దూకుడుగానే ఉంటారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆయన చంద్రబాబుపై ఒంటికాలిమీద లేస్తున్నారు. ఉపయోగించే భాష కూడా రాయలేని విధంగా ఉంటుంది. అయితే తమ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కొడాలి నాని నోట్లో నోరు పెట్టడం వేస్ట్ అన్న భావనలో అనేకమంది నేతలు మౌనంగా ఉంటున్నారు. కానీ దేవినేని ఉమ లాంటి నేతలు ఒకరిద్దరు స్పందిస్తున్నారు.

వసంత… వల్లభనేనిలతో….

టీడీపీ నుంచి ఎవరైనా ప్రభుత్వం, జగన్ పై విమర్శలు చేస్తే వెంటనే టీడీపీ గుర్తు మీద గెలిచిన వల్లభనేని వంశీ రంగంలోకి దిగిపోతారు. చంద్రబాబు చరిత్రను చదవి విన్పిస్తారు. ఇక వసంత కృష్ణ ప్రసాద్ సయితం కూడా చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడేందుకు ముందుకు వస్తారు. అబ్బయ్య చౌదరి, నంబూరు శంకరరావు, జీవీ ఆంజనేయులు వంటి కమ్మ సామాజికవర్గం ఎమ్మెల్యేలున్నా ఈ ముగ్గురు మాత్రం ముందుంటున్నారు. మొత్తం మీద వైసీపీలో ఈ ముగ్గురు టీడీపీకి మింగుడు పడటం లేదు.

Tags:    

Similar News