ఆ..మైలేజీని తక్కువగా అంచనా వేయలేం…!!
మరో మూడు మాసాల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన మూడు పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎవరికి వారే ఒంటరి [more]
మరో మూడు మాసాల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన మూడు పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎవరికి వారే ఒంటరి [more]
మరో మూడు మాసాల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన మూడు పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎవరికి వారే ఒంటరి పోరుతో ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. అంతేకాదు, ఎవరికి వారే అదికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు అనేక రూపాల్లో ప్రయత్నిస్తున్నారు. అధికార టీడీపీ, విపక్షం వైసీపీ, జనసేన పార్టీలు దేనికదే అదికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సుదీర్ఘ పాదయాత్ర ముగించుకున్న జగన్.. ఈ సందర్భంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. తమను గెలిపిస్తే.. విద్యార్థులకు, వృద్ధులకు వికలాంగులకు, వితంతులకు ఇలా సమాజంలోని అన్ని వర్గాలను ఆదుకుంటానని చెబుతున్నారు.
పాదయాత్ర ముగించుకుని…..
ఇక, ఏడాదికిపైగా కాలం నుంచి వైఎస్సార్ నవరత్నాలు కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. పాదయాత్ర ద్వారా గ్రామ గ్రామానా ప్రజలకు చేరువ అయ్యారు. మరి దీని మైలేజీని తక్కువగా అంచనా వేయగలమా? అనేది ప్రశ్న. ఇక, జనసేన విషయానికి వస్తే.. తాజాగా మారిన వ్యూహం ఏంటోకానీ అందరూ మౌనంగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా తనకు అధికారమే కావాలని చెప్పిన పవన్… ఇప్పుడు మాత్రం సిద్ధాంతమే తనకు ముందు అని ప్రకటిస్తున్నారు. ఇక ఎన్నికల మ్యానిఫెస్టో విషయంపై కొన్ని ప్రకటనలు చేసినా.. ఇప్పటి వరకు ఆయన పెద్దగా దృష్టి పెట్టిందిలేదు. ఎక్కడికక్కడ కొత్తవారికి అవకాశం ఇస్తానని చెబుతున్నారు. ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న ట్రెండ్‌ను మార్చుకోవడంలో ఆయన ఎలా సక్సెస్ అవుతారు? డబ్బు లేనిదే ఓటు లేని నేటి కాలంలో కొత్తవారికి అంత డబ్బు ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? అనేది చూసుకోకుండా కేవలం ప్రయోగాత్మక రాజకీయాలు చేస్తున్నట్టుగానే పవన్ వైఖరి నిరూపిస్తోంది.
బాబు దూకుడు పెంచినా….
ఇక, చంద్రబాబు టీడీపీ అధినేత విషయానికి వస్తే.. ఈయన చాలా వ్యూహాత్మకంగా తన 40 ఏళ్ల అనుభవాన్నిరంగరించి ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ ఏ ప్రక్రియ మొదలు పెడితే..అనుకూలంగా ఉంటుందో ముందుగానే గుర్తించి ముందుకుసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో ప్రధానంగా ఉన్న సమస్యలకు చెక్ పెట్టడం ద్వారా అక్కడి ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు తీసుకుంటున్నారు. అదేసమయంలో తనను తాను ప్రొజెక్టు చేసుకుంటూనే సెంటిమెంటును కూడా రంగరించి చేస్తున్న ప్రకటనలు, ప్రసంగాలు సక్సెస్ అవుతాయా? లేదా? అన్నది పక్కన పెడితే బాబు దూకుడు పెంచారు. అభ్యర్థుల ప్రకటన కూడా త్వరలోనే ఉంటుందంటున్నారు. మరి ముగ్గురూ వేగంగా పావులు కదుపుతున్నా… చివరికి గెలుపు ఒకరిదే కావడంతో ఎవరు సక్సెస్ అవుతారన్నది మాత్రం చూడాల్సిందే.