జగన్ కు ముందుంది అంతా?

ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టి ఏడు మాసాలు పూర్తవుతుంది. ఇప్పటి వ‌ర‌కు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప‌థ‌కాల‌ను ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో [more]

Update: 2020-01-06 03:30 GMT

ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టి ఏడు మాసాలు పూర్తవుతుంది. ఇప్పటి వ‌ర‌కు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప‌థ‌కాల‌ను ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీంతో అన్ని వ‌ర్గాల ప్రజ‌ల‌కు విరివిగా నిధుల పందేరం జ‌రిగి పోయింద‌న‌డంలో సందేహం లేదు. అయితే, అదేస‌మ‌యంలో ప్రభుత్వానికి వ‌స్తున్న ఆదాయంలో మాత్రం పెద్దగా పెరుగుద‌ల ఎక్కడా క‌నిపించ‌లేదు. నెల‌కు ర‌మార‌మి రూ.10 వేల కోట్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తోంది. దీనిలో అన్ని స్థాయిల ఉద్యోగుల జీతాలు, భ‌త్యాలు, ప్రభుత్వ చిల్లర ఖ‌ర్చులు స‌రిపోతున్నాయి.

కటకటలాడుతూ…..

ఇక‌, ప్రత్యేకంగా వివిధ వ‌ర్గాల‌కు ప్రవేశ పెడుతున్న ప‌థ‌కాల‌కు మాత్రం నిధుల విష‌యంలో క‌ట‌క‌ట‌లాడాల్సి వ‌స్తోంది. నిజానికి జ‌గ‌న్ ప్రభుత్వం త‌న మేనిఫెస్టోలో కీల‌క‌మైన న‌వ‌ర‌త్నాల అమ‌లు స‌హా నెల నెలా కొత్త ప‌థ‌కాల‌కు శ్రీకారం చుడుతోంది. డిసెంబ‌రు నెల‌లో 24 వేల కోట్ల విలువైన చేనేత నేత‌న్న హ‌స్తాన్ని ప్రవేశ పెట్టింది. ఇక, ఇప్పటికే నెల నెలా పింఛ‌న్లు, అన్ని వ‌ర్గాలకు రాయితీలు ఇవ్వగా ప్రభుత్వ ఖ‌జానా ఓ రకంగా బోసిపోతోంది. ఇక‌, వ‌చ్చే నెల విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా భావిస్తున్న అమ్మ ఒడి కార్యక్రమానికి నిధుల కేటాయింపు అత్యంత కీల‌కంగా మారిపోయింది.

పథకాలను అమలు చేయాలని….

దాదాపు దీనికే 12,500 కోట్ల రూపాయలు అవ‌స‌రం అవుతాయ‌ని ఆర్థిక శాఖ అంచ‌నాలు రూపొందించింది. ఈ క్రమంలో ఈ నిధులు పోగేసుకు నేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. ఇప్పటికే రూ.1500 కోట్ల అప్పు కోసం ఓ నేష‌న‌లైజ్డ్ బ్యాంకుతో సంప్రదింపులు జ‌రుపుతున్నారు. అమ్మ ఒడిని ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా.. జ‌న‌వ‌రి 9 నాటికి ప్రారంభించాల‌ని తాజాగా నిర్వహించిన కేబినెట్ స‌మావేశంలో నిర్ణయించారు. అదేస‌మ‌యంలో సంక్రాంతి నాటికి వైఎస్సార్ రైతు భ‌రోసా కింద రెండో విడ‌త నిధుల‌ను విడుద‌ల చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

మూడు రాజధానులకు…..

దీనికి కూడా దాదాపు 9500 కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నా వేశారు. ఇది కాకుండా రాజ‌ధాని ప్రాంతాలుగా పేర్కొంటున్న విశాఖ‌, క‌ర్నూలు జిల్లాల‌కు కూడా భారీ ఎత్తున నిధులు కేటాయించాల‌ని నిర్ణయించారు. దీంతో ఏతా వాతా ఎలా చూసినా.. ప్రభుత్వానికి వ‌చ్చే నెల భారీ ఎత్తున నిధుల అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం రూపాయి కోసం క‌ట‌క‌ట‌లాడుతున్న ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. పోల‌వ‌రానికి కూడా నిధులు కేటాయించాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాల‌నే యోచ‌న‌లో మునిగిపోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏలా ముందుకు వెళ్తారో చూడాలి.

Tags:    

Similar News