వీరి పదవులు పదిలమేనట

ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో గ‌త రెండు రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పార్టీ అదినేత‌, సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తూ.. చేసిన వ్యాఖ్యల‌ను గుర్తుకు [more]

Update: 2020-01-30 09:30 GMT

ఏపీలోని అధికార పార్టీ వైసీపీలో గ‌త రెండు రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పార్టీ అదినేత‌, సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేస్తూ.. చేసిన వ్యాఖ్యల‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. దీంతో ఈ చ‌ర్చకు ప్రాధాన్యం పెరిగింది. విష‌యంలోకి వెళ్తే త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేస్తూ జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న మంత్రివ‌ర్గంలో చాలా మంది బెర్త్‌ల కోసం ఆశించారు. అయితే, లెక్క ప్రకారం ఉండాల్సిన సంఖ్యను చూసుకుంటే చాలా త‌క్కువ‌గా ఉంది. ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉన్నారు. ఇక‌, మ‌న పార్టీ విధానం మేర‌కు బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు మంత్రివ‌ర్గంలో పెద్దపీట వేయాల‌ని నిర్ణయించాం. సో.. ఆయా వ‌ర్గాల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వ‌స్తోంది“ అన్నారు జ‌గ‌న్‌.

అవకాశం ఇస్తానంటూ….

అదే స‌మ‌యంలో అంద‌రికీ అవ‌కాశం ఇస్తాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే, ఇప్పుడే కాద‌ని, ఇప్పుడు ఏర్పడుతున్న మంత్రి వ‌ర్గం రెండున్నరేళ్లపాటు ఉంటుంద‌ని, త‌ర్వాత మ‌రోసారి మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని చెప్పారు. దీంతో ఆశావ‌హ‌కులు నిరాశ తోనైనా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారిలో చాలా మంది సీనియ‌ర్లు, జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు. వీరంతా కూడా ఎప్పుడు అసెంబ్లీ జ‌రిగిన మంత్రుల వ్యవ‌హార శైలిపై దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే వీక్‌గా వ్యవ‌హ‌రించే మంత్రుల‌ను ఖ‌చ్చితంగా జ‌గ‌న్ ప‌క్కన పెట్టక త‌ప్పదు కాబ‌ట్టి.

రెండున్నరేళ్ల తర్వాత కూడా….

అయితే, ఇలాంటి వారి జాబితా ఎలా ఉన్నప్పటికీ దాదాపు ప‌ది మంది మంత్రుల వ‌ర‌కు మాత్రం జ‌గ‌న్ రెండున్నరేళ్ల త‌ర్వాత కూడా త‌ప్పించే ప‌రిస్థితి లేక పోవ‌డం తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన కీల‌క విష‌యం. ఇప్పుడు ఈ విష‌యంపై వైసీపీ సీనియ‌ర్లు చ‌ర్చించుకుంటున్నారు. అటు అసెంబ్లీలోనూ ఇటు బ‌య‌టా కూడా జ‌గ‌న్ త‌ర్వాత అంత గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నవారిలో కీల‌క మంత్రులుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స స‌త్యనారాయ‌ణ‌, కుర‌సాల క‌న్నబాబు, అనిల్ కుమార్ యాద‌వ్‌, కొడాలి నాని, ఆదిమూల‌పు సురేష్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా క‌నిపిస్తున్నాయి. పైగా వీరికి దూకుడు ఎక్కువ‌గా ఉంది. విప‌క్షాల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇవ్వడంలోనూ ఎలాంటి విష‌యంపైనైనా అన‌ర్గళంగా మాట్లాడడంలోనూ వీరు దూకుడుగానే వ్యవ‌హ‌రిస్తున్నారు.

వీరి పదవులు పదిలమయితే….?

దీంతో వీరి పీఠాలు ప‌దిల‌మేన‌నే వ్యాఖ్యలు సీనియ‌ర్ల నుంచి వినిపిస్తున్నాయి. మ‌రో రెండేళ్ల త‌ర్వాత‌(అంటే ఇప్పటికే ఆరు మాసాలు పూర్తయ్యాయి క‌దా!) కూడా వీరికి స్థానం చ‌ల‌నం ఉండ‌ద‌ని, వీరిని రీప్లేస్ చేయ‌బోర‌ని చ‌ర్చించుకుంటున్నారు. మిగిలిన వారిలోనూ ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు కేటాయించిన మంత్రి ప‌ద‌వుల్లో ఆయా వ‌ర్గాల‌కు చెందిన వారినే(మంత్రులను రీప్లేస్ చేయాల్సి వ‌స్తే) నియ‌మిస్తార‌ని కూడా వీరు భావిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఏర్పాడుతున్న మంత్రి వ‌ర్గం కాబ‌ట్టి.. మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకుంటార‌ని అంటున్నారు. సో మొత్తానికి ఆశావ‌హుల్లో ఇప్పటికే చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News