మెట్టు దిగడమే మేలు

న‌వ్యాంధ్రప్రదేశ్‌లో అధికారం మారి ఆరు నెల‌లు పూర్తి అయింది. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంపై పూర్తిగా దృష్టి సారించారు. అయితే ఏపీలో [more]

Update: 2019-12-07 05:00 GMT

న‌వ్యాంధ్రప్రదేశ్‌లో అధికారం మారి ఆరు నెల‌లు పూర్తి అయింది. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంపై పూర్తిగా దృష్టి సారించారు. అయితే ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం జ‌గ‌న్. దీనితో పాటుగా జ‌గ‌న్ ఏపీలోని అనేక ప్రాజెక్టుల నిర్మాణాల‌పైన కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వీటికి తోడు ఏపీలో అధిక రెవెన్యూ తెచ్చే మ‌ద్యం అమ్మకాల‌ను త‌గ్గించారు. ఇక ఏపీలో జ‌గ‌న్ గ్రామ స‌చివాల‌యాల‌ను ఏర్పాటు చేసి నాలుగు ల‌క్షల ఉద్యోగాలు క‌ల్పించారు. అయితే ఏపీలో జ‌న‌రంజ‌కంగా పాల‌న చేస్తున్న జ‌గ‌న్‌కు ఓ పెద్ద త‌ల‌నొప్పి వ‌చ్చింది. సంక్షేమ ప‌థ‌కాలు, ప్రాజెక్టులు నిర్మించాలంటే అధిక నిధులు కావాల్సిన అవ‌సరం ఉంది.

చొరవ చూపలేకనేనా?

నిధులు కావాలంటే ఏపీకి భారీ ప‌రిశ్రమ‌లు రావాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే ఏపీకి ఇప్పడు ప‌రిశ్రమ‌లు పెట్టెందుకు ఎవ్వరు ముందుకు రావ‌డం లేద‌నేది స‌త్యం. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం జ‌గ‌న్ చొర‌వ తీసుకోవ‌డం లేద‌నే అప‌వాదు లేక‌పోలేదు. అందుకే పారిశ్రామిక పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్త‌లు రాక‌పోగా, వ‌చ్చిన‌వారు వెన‌క్కి వెళ్ళిపోతున్నార‌ని ప్రతిప‌క్షాలు నిత్యం ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. అయితే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టకుండా సీఎం జ‌గ‌న్ అడ్డుకుంటున్నాడ‌ని ప్ర‌తప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శల‌కు, జ‌గ‌న్ వ్యవ‌హ‌రిస్తున్న తీరు అలాగే క‌నిపిస్తుంది.

ఇదే నిదర్శనం…..

అందుకు నిద‌ర్శనం కియా కార్ల కంపెనీ.. చంద్రబాబు పాల‌న‌లో కియా కార్ల కంపెనీ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టి ప్లాంట్ సిద్దం చేసి, ఉత్పత్తి కూడా ప్రారంభించింది. అయితే ఈ కంపెనీపై జ‌గ‌న్ అధికారంలోకి రాగానే గుస్సా అయ్యారు. దీంతో పెట్టుబ‌డులు పెట్టే పారిశ్రామిక‌వేత్తలు ప‌లాయ‌నం చిత్తగించారు. కొంద‌రు అదే ప‌నిలో ఉన్నారు. అయితే ఏపీలో పెట్టుబ‌డులు రావాలంటే ప‌రిపాల‌న‌ తీరులో మార్పు రావాల్సిన అవ‌సరం ఉంద‌ని, అప్పుడే పారిశ్రామిక‌వేత్తలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టెందుకు ముందుకు వ‌స్తార‌ని ఆల‌స్యంగా గ్రహించారు జ‌గ‌న్‌. అందుకే ఇప్పటికే ప్రారంభ‌మైన కియా కార్ల కంపెనీని మ‌రోసారి ప్రారంభించేశారు.

కొత్త కంపెనీల కోసం….

కియా కంపెనీకి జ‌గ‌న్ వెళ్ళడం వ‌ల‌న వ‌చ్చే ప్రయోజ‌నం ఏంటంటే.. విదేశీ పెట్టుబ‌డుల‌పైనా, టీడీపీ పాల‌న‌లో వ‌చ్చిన పెట్టుబ‌డిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు అని చాటిచెప్పే ఉద్దేశ్యమే అని తేట‌తెల్లం చేస్తున్నాయి. అందుకే పెట్టుబ‌డుల కోసం, పారిశ్రామిక‌వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేందుకు జ‌గ‌న్ మెట్టుదిగి రాక త‌ప్పడం లేదు. జ‌గన్ పెట్టుబ‌డుల కోసం ఇంత‌కు ముందు ఒప్పందాలు చేసుకున్న కంపెనీల‌కు భ‌రోసా ఇవ్వాల్సిన అవ‌సరం ఉంది. అంతే కాదు కొత్త కంపెనీల కోసం ముమ్మరంగా ప్రయ‌త్నించ‌క త‌ప్పదు.

భరోసా ఇస్తేనే…?

ఏపీలో పెట్టుబ‌డులు పెట్టే పారిశ్రామికవేత్తల‌ను క‌లిసి వారికి భ‌రోసా ఇస్తూ, రాయితీలు ఇస్తే త‌ప్ప ప్రయోజ‌నం ఉండ‌దు. సో జ‌గ‌న్ ఇక‌ముందు పెట్టుబడుల కోసం మెట్టుదిగి ప్రత్యేక కార్యాచ‌ర‌ణ ప్రక‌టించాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడే పెట్టుబ‌డులు రావ‌డంతో పాటుగా, స్థానిక పెట్టుబ‌డిదారులు ధీమాతో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టెందుకు ముందుకు వ‌స్తారు. ఇక‌నైనా జ‌గ‌న్ పాత పాల‌సీల‌తో పాటు కొత్తగా కొన్ని పాల‌సీలు ప్రవేశ‌పెట్టి కొత్త పెట్టుబ‌డిదారుల‌ను ఆక‌ర్షించాల్సిన అవ‌స‌రం ఉంది.

Tags:    

Similar News