జగనూ….చెక్ పోస్టు పడతాది ?
రాజకీయ నాయకులు అన్న తరువాత విమర్శలు ఉంటాయి. కానీ ఏపీలో చూసుకుంటే అవి హద్దులు మీరుతున్నాయి. వ్యక్తిగత స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి. జగన్ మీద కేసులు ఉన్న సంగతి [more]
రాజకీయ నాయకులు అన్న తరువాత విమర్శలు ఉంటాయి. కానీ ఏపీలో చూసుకుంటే అవి హద్దులు మీరుతున్నాయి. వ్యక్తిగత స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి. జగన్ మీద కేసులు ఉన్న సంగతి [more]
రాజకీయ నాయకులు అన్న తరువాత విమర్శలు ఉంటాయి. కానీ ఏపీలో చూసుకుంటే అవి హద్దులు మీరుతున్నాయి. వ్యక్తిగత స్థాయిలోకి వెళ్ళిపోతున్నాయి. జగన్ మీద కేసులు ఉన్న సంగతి విదితమే. ఆయన కేసులను సీబీఐ చూస్తున్న సంగతీ తెలిసిందే. ఇక జగన్ బెయిల్ మీదనే బయట ఉన్నదీ నిజమే. కానీ ఇపుడు ఆయన ఏపీ సీఎం. దక్షిణాదిన అతి బలవంతుడైన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. దాంతో పాటు జగన్ దూకుడుతో కొన్ని అంశాల్లో రిస్క్ కూడా చేశారు. ఇపుడు ఆ చేసిన రిస్క్ కి జగన్ కి ఏ వైపు నుంచైనా ఇబ్బంది తెస్తుందా? అన్న చర్చ సొంత శిబిరంలోనూ వైరి పక్షంలోనూ జోరుగా సాగుతోంది.
లేఖతో షాక్…?
జగన్ ఏకంగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయ మూర్తి మీద ఫిర్యాదు చేస్తూ ప్రధాన న్యాయ మూర్తికి ఆరు నెలల క్రితం లేఖ రాశారు. అయితే దాని మీద విచారణ జరిపినా ఆరోపణలు లేవని తేలిందని అంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ రమణ రాబోతున్నారు అన్నది వాస్తవం. మరి దీంతోనే జగన్ మళ్ళీ న్యాయపరమైన చిక్కుల్లో పడుతున్నారు అని అంటున్నారు. లేఖ రాసిన జగన్ శుద్ధ పూస కాదని, ఆయన మీద అనేక అవినీతి కేసులు ఉన్నాయని వాటి విషయంలో ఇక మీదట కదలిక వేగంగా ఉంటుందని కూడా ప్రచారం అయితే ఏపీ లోపలా బయటా కూడా జోరుగా సాగుతోంది.
రద్దు అవుతుందా …?
జగన్ కండిషనల్ బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ ని రద్దు చేయాలని రేపటి రోజున ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఒకవేళ బెయిల్ రద్దు అవుతుందా, అయితే పరిస్థితి ఏంటి అన్న దాని మీద చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇక జగన్ కేంద్ర ప్రభుత్వంలో ఈ మధ్యన కొంతవరకూ విభేదిస్తున్నారు అది ఆయన రాజకీయాలకు కూడా ఇపుడు అవసరం. ఏపీ ప్రయోజనాలకు కేంద్రం వరసపెట్టి నష్టం కలిగిస్తూంటే జగన్ మౌనంగా ఉండలేరు కదా. ఇలాంటి ఇరకాటాన్నే ప్రత్యర్ధి పార్టీ టీడీపీ కోరుకుంటోంది. జగన్ పూర్తి కాలం సీఎంగా ఉండడు అంటూ ఆ పార్టీ నుంచి అపుడే జోస్యాలు కూడా మొదలైపోయాయి.
ఢీ కొడితేనే …?
ఇక ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ ఏపీ ప్రయోజనాల కోసం ఎదిరించి నిలబడడమే మేలు అన్న విశ్లేషణలు ఉన్నాయి. అదే ఆయనకు శ్రీరామ రక్ష అని కూడా అంటున్నారు. ఎటూ ఏపీలోని ప్రజానీకం జగన్ కి పూర్తి మద్దతుగా ఉన్నారు. అయినా సరే రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన ఎంతలా ఢీ కొడితే అంతలా ఆయనకు కొత్త ఇబ్బందులు వస్తాయి. అలా వచ్చిన సందర్భంలో కూడా జనాలలో మద్దతు కనుక ఇదే విధంగా ఉంటే జగనే మళ్ళీ విజేత అవుతారు. సరిగ్గా పదేళ్ల క్రితం జగన్ విషయంలో జరిగిన తెర వెనక కుట్ర మళ్ళీ మొదలైతే మాత్రం దాన్ని తట్టుకునే నేర్పూ రాజకీయం రెండూ ఇపుడు జగన్ కి ఉన్నాయనే అంటున్నారు. చూడాలి మరి ఏ జరుగుతుందో.