థిక్కారం ఎక్కువగానే ఉంది…..పార్టీ ప్రక్షాళన తప్పదు
ఈ రోజున వైసీపీ అధికార వైభోగంతో ఇంతలా విరాజిల్లడానికి కారణం పార్టీ. ఆ పార్టీని నమ్ముకుని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇక ఆస్తులను అమ్ముకుని నాయకులు [more]
ఈ రోజున వైసీపీ అధికార వైభోగంతో ఇంతలా విరాజిల్లడానికి కారణం పార్టీ. ఆ పార్టీని నమ్ముకుని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇక ఆస్తులను అమ్ముకుని నాయకులు [more]
ఈ రోజున వైసీపీ అధికార వైభోగంతో ఇంతలా విరాజిల్లడానికి కారణం పార్టీ. ఆ పార్టీని నమ్ముకుని లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇక ఆస్తులను అమ్ముకుని నాయకులు ఏళ్లకు ఏళ్ళు పనిచేశారు. అదే విధంగా జగన్ ముఖ్యమంత్రి కావాలని తమ కాలాన్ని డబ్బుని మొత్తం వెచ్చించి పనిచేసిన వారు వేలాది మంది నాయకులుగా కనిపిస్తారు. అంతా కోరుకుంటున్నట్లుగా పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కష్టించి పనిచేసిన వారికి న్యాయం జరిగిందా? అంటే లేదు అన్న జవాబే వస్తుంది.
ధిక్కారాలతోనే అలా….
వైసీపీలో క్రమశిక్షణ ఒకపుడు గట్టిగా కనిపించేంది. జగన్ ఒక మాట చెబితే అంతా సరే అనేవారు. అదంతా ప్రతిపక్షంలో ఉన్నపుడు జరిగిన ముచ్చటగానే మిగిలిపోయింది. ఎపుడైతే జగన్ సీఎం సీట్లో బిజీ అయిపోయారో, నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అధికారాన్ని అందుకున్నారో నాటి నుంచే పార్టీకి అసలైన కష్టాలు మొదలయ్యాయి. పార్టీని వదిలేసి తమ సొంత మద్దతుదారులకే మంత్రులు, ఎమ్మెల్యేలు పరిమితం అయ్యారు. కనీసం పార్టీ ఆఫీస్ కి కూడా రాని వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి కొందరికి పార్టీ కంటే తమ సొంత ఆఫీసులే ఎక్కువ అయ్యాయి. దీంతోనే పంచాయతీ ఎన్నికల్ల్లో ధిక్కారాలు ఎక్కువగా వినిపించాయి. రెబెల్స్ బెడద వైసీపీని పట్టి పీడించింది.
వాళ్ళే ఓడించారా …?
సొంత పార్టీ వారే వైసీపీని ఓడించారా. వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు పంచాయతీల్లో రాకుండా చేశారా అంటే అవును అంటున్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్. వైసీపీ ప్రభుత్వం అమలు సంక్షేమ పధకాలకు నూటికి నూరు శాతం పంచాయతీలు తమ పార్టీ పరం కావాలని ఆయన చెబుతున్నారు. కానీ పార్టీలో జరిగిన పొరపాట్లు వల్లనే ఇలా జరిగింది అంటున్నారు. పార్టీలో రెబెల్స్ పెద్ద ఎత్తున పోటీ చేయడం వల్ల మధ్యలో వచ్చిన టీడీపీకి ఎక్కువ సీట్లు దక్కాయన్న క్రిష్ణ దాస్ వాదనలో కూడా నిజముంది అంటున్నారు.
భారీ మార్పులే ….
జగన్ కి ఒక్కసారిగా వైసీపీ ఏ స్థితిలో ఉందో పంచాయతీ ఎన్నికల పుణ్యమాని తెలిసి వచ్చింది అంటున్నారు. అందుకే ఆయన ఇపుడు పార్టీని పటిష్టం చేయడం మీద దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. నోరున్న వారిని, పేరున్న వారిని ఎంపిక చేసి పార్టీలో ముఖ్య బాధ్యతలు అప్పగించాలని జగన్ ఆలోచిస్తున్నారుట. పార్టీ మహిళా విభాగం నుంచి యువజ విభాగం దాకా అంతా పూర్తిగా మార్చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికలు ఎపుడు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు పార్టీని మొత్తం సమూలంగా ప్రక్షాళన చేస్తారని తెలుస్తోంది. జూలైలో పార్టీ ప్లీనరీని కూడా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. దానికి ముందే పార్టీలో పెను మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మరి పార్టీ కోసం కష్టపడిన వారికి జగన్ పదవులు ఇస్తారా లేదా అన్నది చూడాలి.