లైట్ తీసుకుంటే…అంతే.. ఫలితం ఇలానే ఉంటుంది
ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోక పోవడం ఫలితం ఇప్పుడు జగన్ కు తెలిసివచ్చింది. గత ఇరవై నెలల నుంచి పార్టీని పూర్తిగా జగన్ పక్కన పెట్టేశారు. తాడేపల్లి నివాసానికే [more]
ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోక పోవడం ఫలితం ఇప్పుడు జగన్ కు తెలిసివచ్చింది. గత ఇరవై నెలల నుంచి పార్టీని పూర్తిగా జగన్ పక్కన పెట్టేశారు. తాడేపల్లి నివాసానికే [more]
ఇన్నాళ్లూ పార్టీని పట్టించుకోక పోవడం ఫలితం ఇప్పుడు జగన్ కు తెలిసివచ్చింది. గత ఇరవై నెలల నుంచి పార్టీని పూర్తిగా జగన్ పక్కన పెట్టేశారు. తాడేపల్లి నివాసానికే పరిమితమయిన జగన్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నా దానిని సరిదిద్దే పనిని చేపట్టలేదు. దీంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు చుక్కలు చూపిస్తున్నాయి. సరే ఫలితాల తర్వాత సంగతి ఏందన్నది పక్కన పెడితే ఏకగ్రీవాలు కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో సాధించలేకపోవడానికి వైసీపీ నేతల్లో ఉన్న విభేదాలే కారణమని చెప్పక తప్పదు.
ఇరవై నెలల నుంచి పాలనపైనే…..
ఇరవై నెలల నుంచి జగన్ పాలనపైనే దృష్టి పెట్టారు. మధ్యలో కరోనా అడ్డు వచ్చినా సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదు. ఆ విధంగా ప్రభుత్వ అధినేతగా జగన్ మంచి మార్కులే సంపాదించుకున్నారు. కానీ పార్టీ అధినేతగా మాత్రం జగన్ ఈ ఇరవై నెలల్లో ఫెయిల్యూర్ అయ్యారని చెప్పకతప్పదు. జగన్ చూపించిన అలసత్వం టీడీపీకి వరంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు సెట్ చేద్దామనుకున్నా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.
క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లోనూ…
గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఈ జిలాల్లో అతి తక్కువగానే ఏకగ్రీవాలు నమోదయ్యాయి. వైసీపీ నేతలు మధ్య విభేదాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. అది పదవుల కోసం కావచ్చు. కాంట్రాక్టుల కోసం కావచ్చు. రెండు, మూడు వర్గాలుగా విడిపోయి జెండాను పట్టుకున్నారు.
ఇప్పుడనుకుని ఏం లాభం..?
దీనికి మూడు ప్రాంతాలకు విజయసాయిరెెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను ట్రబుల్ షూటర్లుగా నియమించినా పెద్దగా ఫలితాలు కన్పించలేదు. రచ్చ రచ్చ అవుతున్నా కనీసం తాడేపల్లికి పిలిపించి జగన్ మాట్లాడలేదు. అసలు ఎమ్మెల్యేలతో కలిసే ప్రయత్నమే జగన్ చేయలేదు. దాని ఫలితమే జగన్ తాను అనుకున్నట్లు ఏకగ్రీవాలు చేయలేకపోయారు. అతి తక్కువ సంఖ్యలోనే ఏకగ్రీవాలు నమోదయ్యాయి. పార్టీకి తానే సుప్రీం అయిన జగన్ విభేదాలను లైట్ తీసుకున్నందుకే ఈ పరిస్థితి తలెత్తిందని పార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జగన్ మేలుకోకపోతే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.