అదేంటో… అస్సలు కలసి రావడం లేదే?
అదేంటో కాని ఏ నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోవడంలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పెండింగ్ లోనే పడిపోతున్నాయి. న్యాయపరమైన చిక్కులతో [more]
అదేంటో కాని ఏ నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోవడంలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పెండింగ్ లోనే పడిపోతున్నాయి. న్యాయపరమైన చిక్కులతో [more]
అదేంటో కాని ఏ నిర్ణయం తీసుకున్నా అమలుకు నోచుకోవడంలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు పెండింగ్ లోనే పడిపోతున్నాయి. న్యాయపరమైన చిక్కులతో పాటు కేంద్ర ప్రభుత్వం కొర్రీలతో జగన్ నిర్ణయాలు ఏవీ ఆచరణలో సాధ్యపడటం లేదు. ఇటు న్యాయపరంగా ఎదురువతున్న ఇబ్బందులతో పాటు కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ కూడా అనేక అంశాలు అమలు సాధ్యం కావడం లేదు.
అనేక నిర్ణయాల్లో….
ముఖ్యమంత్రి జగన్ తన ఇరవై నెలల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మూడు రాజధానుల అంశం. ఇది ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ప్రధాన న్యాయమూర్తి బదిలీ కావడంతో మరికొన్ని రోజులు విచారణ జరిగే అవకాశముంది. హైకోర్టు తరలింపు కూడా తమ చేతిలో లేదని కేంద్రం చెప్పేసింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం హైకోర్టుతో చర్చలు జరిపి కర్నూలుకు తరలింపు పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలున్నాయి.
రద్దు ఇక జరగదట…..
శాసనమండలి రద్దును జగన్ ప్రభుత్వం గత ఏడాదిలోనే ప్రకటించింది. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. కానీ ఇంతవరకూ దానిపై అతీగతీ లేదు. మిగిలిన రాష్ట్రాల్లో శాసనమండలిని పునరుద్ధరించాలని కేంద్రానికి వినతులు అందడంతో ఇప్పట్లో శాసనమండలి రద్దు అయ్యే అవకాశాలు లేవు. ఇక జగన్ తో పార్టీని ఇబ్బంది పెడుతున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలోనూ జగన్ ఏమీ చేయలేకపోతున్నారు.
రాజుగారిపై చర్యలేవీ?
రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నాయి. అయినా చర్యలు లేవు. దీంతో రాజుగారు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఈ అంశం కూడా ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. ఇప్పుడు తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని రకాలుగా జగన్ సహకరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం జగన్ పై చిన్నచూపు చూస్తుందంటున్నారు. టీడీపీ ఎంపీలకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద జగన్ కు ఏదీ కలసి రావడం లేదు. ఆయన అనుకున్న నిర్ణయాలేవీ అమలు కావడం లేదు.