జగన్ కి మావోల రెడ్ సిగ్నల్…?
మావోయిస్టులు అంటే ఎవరికీ ఇష్ఠులు కారని అంటారు. వారు వర్తమాన సమాజానికి దూరంగా వెళ్ళిన వారు. ఉన్న సమాజం పోకడలు నచ్చని వారు. వీలు అయితే అపర [more]
మావోయిస్టులు అంటే ఎవరికీ ఇష్ఠులు కారని అంటారు. వారు వర్తమాన సమాజానికి దూరంగా వెళ్ళిన వారు. ఉన్న సమాజం పోకడలు నచ్చని వారు. వీలు అయితే అపర [more]
మావోయిస్టులు అంటే ఎవరికీ ఇష్ఠులు కారని అంటారు. వారు వర్తమాన సమాజానికి దూరంగా వెళ్ళిన వారు. ఉన్న సమాజం పోకడలు నచ్చని వారు. వీలు అయితే అపర విశ్వామిత్ర సృష్టి చేసి అయినా తాము అనుకున్న నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఉబలాటపడేవారు. అటువంటి మావోయిస్టులు ఏ ప్రభుత్వాన్ని వదలిపెట్టరన్నది తెలిసిందే. తాజాగా వైసీపీ సర్కార్ ని డైరెక్ట్ గా జగన్ ని కూడా మావోయిస్టులు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు.
బాక్సైట్ మీద గుర్రు….
నాడు జగన్ ప్రతిపక్షంలో ఉంటూ బాక్సైట్ తవ్వకాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. జగన్ ఏజెన్సీలో పర్యటించారు కూడా. అపుడు ఆయనకు మావోల నుంచి ఎటువంటి ముప్పూ కూడా లేదు. నాడు టీడీపీ సర్కార్ అధికారంలో ఉంది. చంద్రబాబునే మావోలు టార్గెట్ చేశారు. ఏజెన్సీలో ఉన్న గిరిజనులు సైతం జగన్ అన్నా ఆయన పార్టీ అన్నా ఇష్టపడి ఓటేస్తూ వచ్చారు. ఇపుడు మావోల స్వరం మారుతోంది. జగన్ బాక్సైట్ తవ్వకాలు వద్దు అంటూ నాడు చెప్పిన జగన్ ఏ మార్పు లేకుండానే జీవో నంబర్ 89 తీసుకొచ్చారు అంటూ మావోయిస్ట్ పార్టీ నేత అరుణ తాజాగా విమర్శించడం ప్రకంపనలే రేపుతోంది.
టీడీపీ టార్గెట్….
టీడీపీలో ఎన్టీయార్ తరువాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. బాబు అంటే మావోలకు ఎందుకో గిట్టలేదు. ఆయన విధానాలను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో 1995 నుంచి 2018 వరకూ ఎంతో మంది టీడీపీ నేతలను విశాఖ మన్యంలో ఆ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. మావోలు బాబు పార్టీని ఏజెన్సీలో దాదాపుగా సమాధి చేశారు. ఎంతలా అంటే టీడీపీకి ఓటు వేయడానికే గిరిజనులు భయపడేటంతగా. ఇక వైఎస్సార్ పట్ల మన్యం ప్రజలు సానుకూలత పెంచుకుని కాంగ్రెస్ ని గెలిపిస్తూ వచ్చారు. ఆ తరువాత ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి టర్న్ అయింది. ఇపుడు మావోలు జగన్ మీద కూడా గుర్రుమంటున్నారు. దాంతో ఆ పార్టీ ఏజెన్సీ ప్రజా ప్రతినిధులు కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతోంది.
హామీలు నెరవేరిస్తేనే..?
తాను అధికారంలోకి వస్తే నూటికి నూరు శాతం గిరిజన రిజర్వేషన్లు ఏజెన్సీలో అమలు చేస్తానని, ఉద్యోగాలు వారికి పెద్ద ఎత్తున ఇస్తామని ఉపాధి అవకాశాలు పెంచుతామని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. దాని ఏజెన్సీ ఉద్యోగాలు వారికే అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దాని మీద న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ ని జగన్ సర్కార్ దాఖలు చేయకపోవడాన్ని మావోలు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీలో ఇప్పటికీ బలంగా ఉన్న వైసీపీని రాజకీయంగా పటిష్టం చేసుకోవలంటే జగన్ తన హామీలు నిలబెట్టుకోవాల్సిందే అంటున్నారు. చూడాలి మరి మావోల సెగ నుంచి వైసీపీ ఎలా తప్పించుకుంటుందో. అన్నట్లు జగన్ మూడు రాజధానుల మీద కూడా మావోలు గుస్సా అవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప ప్రజలకు దీని వల్ల ఉపయోగమేదీ లేదని కూడా తేల్చేస్తున్నారు.