ఆ సమయం వచ్చేసిందన్నా….?
జగన్ పదకొండేళ్ళ క్రితం తండ్రి చాటును తొలగించుకుని రాజకీయంగా ఒంటరిగా కత్తి దూశారు. నాటి కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధీని ఎదిరించిన వీరుడిగా ముద్ర పడ్డారు. మహామహులు [more]
జగన్ పదకొండేళ్ళ క్రితం తండ్రి చాటును తొలగించుకుని రాజకీయంగా ఒంటరిగా కత్తి దూశారు. నాటి కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధీని ఎదిరించిన వీరుడిగా ముద్ర పడ్డారు. మహామహులు [more]
జగన్ పదకొండేళ్ళ క్రితం తండ్రి చాటును తొలగించుకుని రాజకీయంగా ఒంటరిగా కత్తి దూశారు. నాటి కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధీని ఎదిరించిన వీరుడిగా ముద్ర పడ్డారు. మహామహులు చేయలేని పనిచేసి జగజ్జేత అని కూడా అనిపించుకున్నారు. అయితే వాటి ఫలితాలను ఆయన ఇప్పటికీ సీబీఐ కేసుల రూపంలో అనుభవిస్తున్నారు. అది వేరే విషయం కానీ కాంగ్రెస్ నేతలకు సలాం చేసిన తరాలనే అంతదాకా చూస్తూ వచ్చిన తెలుగు సమాజం జగన్ లో తలవంచని వీరుడిని చూసి పులకించిపోయింది. అందుకే ఆయనకు ఇంతటి రాజకీయ భవిష్యత్తును కూడా అలా ప్రసాదించింది.
రగిలిన పగతో అలా ..?
నాలుగు దశాబ్దాల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో నాటి సీఎం అంజయ్యను అవమానించారన్న వార్తతో ఉమ్మడి ఆంధ్రా రగిలిపోయింది. ఆ వేడి నుంచి పుట్టినదే తెలుగుదేశం పార్టీ. కొన్నేళ్ళ పాటు తెలుగువారి పౌరుషాన్ని అలా నిలబెట్టి ఢిల్లీలో రీ సౌండ్ చేసిన ఘనుడు అన్న గారు. ఆయన తరువాత మళ్లీ ఎవరూ అలా లేకపోవడం చేత తెలుగు వారి గర్వం అణగిపోయింది. చంద్రబాబు అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయినా ఢిల్లీ పాదుషాలకు దాసొహం అన్నట్లుగానే ఇప్పటిదాకా కధ నడిచింది. మధ్యలో వైఎస్సార్ కొంత బెటర్ అనిపించుకున్నారు.
నాటి కంటే ఎక్కువ …?
ఇపుడు బీజేపీ నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. కాంగ్రెస్ నేతల కంటే కూడా అన్యాయం ఈనాడు అనేక రాష్త్రాలకు జరుగుతోంది. ఇందిరా గాంధీ టైంలో రాష్ట్రాలకు హక్కులు కావాలని ఎన్టీయార్ గర్జించారు కానీ ఇపుడు మోడీ అంతకంటే ఎక్కువగా అవమానాలు చేస్తున్నారన్నది దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆవేదన. ఇక ప్రత్యేకించి ఏపీ వరకూ చూస్తే ఆరేళ్ల ఏలుబడిలో బీజేపీ చేసిన అవమానాలు, వాగ్దాన భంగాలూ అన్నీ ఇన్నీకావు. చంద్రబాబు దాసోహం అయ్యారనే జనం ఓడించి ఇంటికి పంపారు, మరి మేరునగ ధీరుడు అనిపించుకున్న జగన్ అయిన ఢిల్లీకి సవాల్ చేయకపోతే ఎలా అన్నదే ప్రతీ ఆంధ్రుడి ఆవేదనగా ఉంది.
ఉండవల్లి లాజిక్ ….
పోరాడితే పోయేది ఏమీ లేదు అన్నది విప్లవ సిద్ధాంతం. పదహారు నెలలు జైలు జీవితం ప్రౌఢ పాయంలో చవి చూసిన జగన్ కి అంతకంటే పెద్ద శిక్షలు ఏముంటాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పీకను నిలువునా నులిమేస్తున్న కేంద్రం మీద ఇపుడు కాక మరెపుడు ఉద్యమిస్తారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంధించిన ప్రశ్నకు కచ్చితంగా జగన్ స్పందించాల్సిందే. జగన్ మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి 151 సీట్లతో తనను గౌరవించిన జనం అన్యాయం కాకుండా కాపాడడం. రెండు పోలవరం దివంగత సీఎం వైఎస్సార్ కలలు కన్న ప్రాజెక్ట్. ఆ తండ్రి కొడుకుగా ఎన్నో పధకాలు అమలు చేస్తున్న జగన్ కచ్చితంగా శాశ్వతంగా నిలిచిపోయే పోలవరం ప్రాజెక్టు కోసం ముందుండి పోరాడాలి. ఇదే ఉండవల్లి కూడా చెప్పినది. ఈ పోరులో ఒకవేళ జగన్ మోడీని ఎదిరించి జైలుకు వెళ్తే జనమే ఆయన్ని తిరిగి తెచ్చి సీట్లో కూర్చోబెడతారు. అది సత్యం. గతంలో కూడా జరిగింది కూడా. అయినా జగన్ని జైలు కి ఈ వేళ పంపితే ఏపీ అల్లకల్లోలం అయిపోదూ. ఇదీ ఉండవల్లి చెప్పినదే. లాజికల్ గా చూసినా ఇదే నిజం కూడా. మొత్తానికి జగన్ కేంద్రం మీద తిరబడాల్సిన సమయం ఆసన్నమైంది అని అంతా అంటున్నారు. చూడాలి మరి.