ఆ ఎమ్మెల్యేలకు చిక్కులు తప్పేట్లే లేవు

రాజ‌ధాని మార్పు లేదా మూడు చోట్ల రాజ‌ధాని ఏర్పాటు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు అట్టుడుకుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై స‌ర్వత్రా ఆస‌క్తి రేగింది. దీనిలో [more]

Update: 2019-12-27 02:00 GMT

రాజ‌ధాని మార్పు లేదా మూడు చోట్ల రాజ‌ధాని ఏర్పాటు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయాలు అట్టుడుకుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై స‌ర్వత్రా ఆస‌క్తి రేగింది. దీనిలో భాగంగా ఇప్పటికే జీఎన్ రావు క‌మిటీ నివేదిక స‌మ‌ర్పించింది. రాష్ట్రంలో అభివృద్ధి అస‌మ‌తుల్యంగా ఉంద‌ని చెప్పిన క‌మిటీ.. అభివృద్ధి బ‌దులు పాల‌న ప‌రంగా వికేంద్రీక‌ర‌ణ చేయ‌డం ద్వారా ప్రజ‌ల జీవ‌న ప్రమాణాలు మెరుగ‌వుతాయ‌ని, ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు వ‌చ్చి.. ప్రజ‌ల ఆర్థిక ప‌రిస్థితి మెరుగ‌వుతుంద‌ని కూడా క‌మిటీ పేర్కొంది. దీనిపై ఇంకా చ‌ర్చలు జ‌ర‌గాల్సి ఉంది. ఈలోగా మ‌రో క‌మిటీ బోస్టన్ కూడా నివేదికను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

కోట్లు ఖర్చు చేసిన……

అయితే, ఇప్పుడు ఏది ఎలా ఉన్నప్పటికీ.. రాజ‌ధాని విష‌యంలో మాత్రం ప్రతిప‌క్షాలు లేవ‌నెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ది చేసిన అమ‌రావ‌తిని, ముఖ్యంగా ఐదు వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు ప్రజాధ‌నాన్ని వెచ్చించిన ప్రాంతానికి అన్యాయం చేస్తారా? అనేది అమ‌రావ‌తి ప్రాంత రైతులు, ప్రజ‌ల ప్రధాన ప్రశ్న. ఇప్పుడు ఇది రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ రాజధాని ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీట్లను కైవ‌సం చేసుకుంది.

రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు….

రాజ‌ధాని అభివృద్దితో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేస్తుంద‌ని అంద‌రూ అనుకున్నా ఆ రెండు జిల్లాల్లో టీడీపీ కేవ‌లం నాలుగు సీట్లతోనే స‌రిపెట్టుకుంది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి, న‌ర‌స‌రావుపేట‌, తాడికొండ‌, గుంటూరు వెస్ట్, పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. చంద్రబాబు రాజ‌ధాని సెంటిమెంట్ నేప‌థ్యంలో త‌న కుమారుడిని ఇక్కడ స్వయంగా పోటీ చేయించినా జ‌నాలు మాత్రం ఓడించారు. అయితే ఇప్పుడు అదే రాజ‌ధాని నియోజ‌క‌ర్గాల ప్రజ‌లు వీధుల్లోకి వ‌స్తున్నారు.

ఎమ్మెల్యలేకు ఇబ్బందే….

వీరంతా తెలిసి అడిగినా.. తెలియ‌క అడిగినా.. రాజ‌ధాని ప్రాంతం అమ‌రావతిలోనే ఉంటుందా? ఉండ‌దా? అనేది. దీనికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు స‌మాధానం చెప్పలేని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదిలావుంటే, న‌ర‌స‌రావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి మాత్రం ప్రభుత్వ వాద‌న‌కు భిన్నమైన వాద‌న తీసుకువ‌చ్చారు. అమ‌రావ‌తి ఎక్కడికీ పోద‌ని, తాను అవ‌స‌ర‌మైతే.. సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడి ఇక్కడి ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా నిర్ణయం వ‌చ్చేలా చూస్తాన‌ని ఆయ‌న చేసిన వ్యాఖ్యలు అధిష్టానానికి ఇప్పటికే మంట పుట్టించాయి.

సమాధానం చెప్పలేక….

దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సీరియ‌స్ అయ్యారు. మ‌రోప‌క్క, ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్ల శ్రీదేవి ఎవ‌రికీ ఏం చెప్పాలో తెలియ‌క అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలోకే రాలేద‌ని స‌మాచారం. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డిదీ అదే ప‌రిస్థితి. మొత్తంగా వీరు జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇబ్బంది ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఈ ర‌గ‌డ ఎలా స‌ర్దుబాటు అవుతుందో చూడాలి.

Tags:    

Similar News