ఇద్దరు మిత్రుల కధ
రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఉండరు. కానీ అవసరాలే అలా బంధాలను కలుపుతాయి. కొన్నిసార్లు అవసరం కంటే కూడా అహంకారం, ఆధిపత్యం డామినేట్ చేస్తాయి. ఒకే గూటి పక్షులైతే [more]
రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఉండరు. కానీ అవసరాలే అలా బంధాలను కలుపుతాయి. కొన్నిసార్లు అవసరం కంటే కూడా అహంకారం, ఆధిపత్యం డామినేట్ చేస్తాయి. ఒకే గూటి పక్షులైతే [more]
రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఉండరు. కానీ అవసరాలే అలా బంధాలను కలుపుతాయి. కొన్నిసార్లు అవసరం కంటే కూడా అహంకారం, ఆధిపత్యం డామినేట్ చేస్తాయి. ఒకే గూటి పక్షులైతే ఇగోలతో కధ మొత్తం అడ్డం తిరుగుతుంది. నిన్నటివరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కధ ఇదే. చంద్రబాబుకు రాజకీయ శిష్యుడు కేసీయార్. అప్పట్లో వెన్నుపోటు ఎపిసోడ్ తరువాత బాబు కేసీయార్ ని బాగా చూసుకుని క్యాబినేట్లో మంత్రి పదవి కూడా ఇచ్చాడు. ఆ తరువాత 1999 నాటికి సీన్ రివర్స్ అయింది. కేసీయార్ ని డిప్యూటీ స్పీకర్ ని మాత్రం చేసి మంత్రి పదవి ఎగ్గొట్టారు. దాంతో తనని తక్కువ చేశారన్న ఆవేదనతో కేసీయార్ బయటకు వచ్చేశారు. తరువాత తెలంగాణా ఉద్యమ కధ అందరికీ తెలిసిందే.
బాబుని మించిన నేత :
అలా బాబుని కాదని వచ్చిన వారు ఎవరూ ఆ రోజుల్లో మనలేకపోయారు. కేసీయార్ మాత్రం బాబుని సీఎం సీటు నుంచి దించేయగలిగారు. మళ్ళీ ఉమ్మడి ఏపీలో బాబు సీఎం కాలేకపోయారు. ఇక కేసీయార్ మాత్రం తాను కోరుకున్న తెలంగాణాను తెచ్చుకుని ముఖ్యమంత్రి అయ్యారు. అంతే కాదు, రెండవమారు కూడా గొప్పగా గెలిచారు. ఇక బాబుతో ఎపుడూ కేసీయార్ కి మంచి సంబంధాలు లేవు. బాబుకు తనని కేసీయార్ దెబ్బ కొట్టారని ఆక్రోశం. కేసీయార్ కి బాబు గురించి అంతా తెలుసు కాబట్టి దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందో అన్న అనుమానం, ఇవన్నీ కలసి ఈ ఇద్దరు సీఎంలు అయిదేళ్ళ పాటు బద్ద శత్రువులుగానే బతికారు.
ఈ స్నేహం కలకాలం :
ఇక జగన్ ఏపీ సీఎం అయ్యాక కేసీయార్ ఏపీ తరచూ వస్తున్నారు. జగన్ ప్రమాణ స్వీకారంతో పాటు ఒకటి రెండు సార్లు ఏపీ టూర్లు వేశారు. ఇక జగన్ ప్రగతిభవన్లోకి ఇప్పటికి రెండు సార్లు వెళ్లారు. తాజాగా నీటి పంపకాలు, ఇతర విభజన సమస్యల మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. కలసి ఒకటిగా సాగాలని నిర్ణయించుకున్నారు. నిజంగా ఇద్దరు మంచి మిత్రులు అయిపోయారని అంతా అనుకుంటున్నారు. ఈ బంధం కలవడం వెనక రాజకీయ అవసరాలతో పాటు ఒకరి మీద మరొకరికి నమ్మకం గట్టిగా ఉంది. వయసులో తండ్రి సమానుడైన కేసీయార్ ని జగన్ నమ్ముతున్నారు. అదే విధంగా కేసీయార్ సైతం జగన్ మాట మీద నిలబడే తత్వాన్ని విశ్వసిస్తున్నారు
ఇక ఉమ్మడి ఏపీలో జల వివాదాల మీద పూర్తి అవగాహన కేసీయార్ కి ఉంది. జగన్ సైతం చొరవ చూపిస్తున్నారు. ఇద్దరు సీఎంలు కలసి రెండు రాష్ట్రాలకు మంచి చేసేందుకు ప్రగతి శీల ప్రతిపాదనలు చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఇపుడున్న వాతావరణంలో ఏపీ చాలా ఇబ్బందులో ఉంది. విభజన తరువాత సంపన్న రాష్ట్రమైన తెలంగాణ అండ ఉండడం ఏపీకి అవసరం, అలాగే కేసీయార్ లాంటి రాజకీయ అనుభవం ఉన్న నాయకుని మద్దతు జగన్ కి కూడా అవసరం. ఈ ఇద్దరు మిత్రులు రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశానికే కొత్త స్పూర్తిని ఇస్తారని అంతా ఆశిస్తున్నారు.