జగన్ మార్క్ కళ్లెం…..ఇంచార్జ్ లబోదిబో
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అధినేత, సీఎం జగన్ క్రమ శిక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్‌కు అనుగు ణంగానే పనిచేయాలని ఆయన ఇప్పటికే [more]
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అధినేత, సీఎం జగన్ క్రమ శిక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్‌కు అనుగు ణంగానే పనిచేయాలని ఆయన ఇప్పటికే [more]
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అధినేత, సీఎం జగన్ క్రమ శిక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్‌కు అనుగు ణంగానే పనిచేయాలని ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అధినేత మాటను పరిగణనలోకి తీసుకుని లైన్‌లో పడ్డవారి పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. అధినేత మాటలను సైతం లెక్కచేయకుండా తమ స్టైల్లోనే ముందుకు సాగుతున్న వారికి మాత్రం జగన్ తనదైన శైలిలో చెక్ పెడుతున్నారు. ఇలాంటి వారిలో ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పరిస్థితి మనకు తెలిసిందే. ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా.. తన దైన దూడుకుడు ప్రదర్శిస్తున్నారు.
దీంతో జగన్ ఆమంచిని దాదాపు పక్కన పెట్టారు. ఎన్నికలకు ముందు ఆమంచికి ఉన్న ప్రయార్టీ ఇప్పుడు లేదు. ఇక, ఇలాంటి పరిస్థితే కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోనూ జరుగుతోంది. నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్‌గా యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. అయితే, ఈయన ఆది నుంచి దూకుడు ప్రదర్శిస్తు న్నారు. యువకుడు, ఉత్సాహ వంతుడు, ఉన్నత విద్యావంతుడు కావడంతో దూకుడు సహజమేనని అందరూ అనుకున్నారు. అయితే, ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్‌తోనూ ఆయన నిత్యం ఘర్షణకు దిగుతున్నారు. ఇంచార్జ్‌గా ఆయన తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా తాను చెప్పినట్టే జరగాలని.. అధికారుల బదిలీలు సైతం తన కనుసన్నల్లోనే జరగాలని ఆయన హుకూం జారీ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇది పార్టీకి తలనొప్పి గా మారింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా జగన్ పలుమార్లు హెచ్చరించారు. అయినా కూడా బైరెడ్డిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. పైగా ఇప్పటికీ తనదే పైచేయి అనే ధోరణిని అవలంబిస్తున్నారు. దీంతో రాను రాను ఇక్కడి పరిస్థితి మరింత ముదురుతోంది. దీనిని గమనించిన జగన్ మాటలతో పనికాదని అనుకున్నారో ఏమో తెలియదుకానీ.. గతంలో బైరెడ్డికి ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తొక్కి పెట్టారు. వాస్తవానికి బైరెడ్డికి కర్నూలు డీసీసీబీ లేదా డీసీఎంఎస్‌లలో ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది.
కానీ, పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయినా.. ఇప్పటి వరకు కూడా జగన్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దీనికి ప్రధానంగా బైరెడ్డి దూకుడే కారణమని అంటున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం 13 జిల్లాలకు డీసీసీబీ, డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఇందులో బైరెడ్డి పేరు కర్నూలులో గ్యారెంటీ ఉంటుందనుకున్నా ఆయన ఆశలు రివర్స్ అయ్యాయి. బైరెడ్డి దూకుడు తగ్గించి నిలకడైన రాజకీయాలు చేసే వరకు కూడా వేచి చూడాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు జిల్లాలో వైసీపీని చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ క్రమంలో బైరెడ్డి ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.